ముంబయి సొరంగ మార్గం మూణ్ణాళ్ల ముచ్చటేనా ?

మూడు నెలల క్రితమే ప్రారంభించిన ఈ సొరంగ మార్గంలో అప్పుడే గోడల నుంచి నీళ్లు లీక్ కావడం ఆందోళనకరం.

Update: 2024-05-29 08:30 GMT

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ (సౌత్) దక్షిణ ముంబైలోని ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్ నుండి బాంద్రా వర్లీ సీ లింక్ యొక్క వర్లీ ఎండ్ వరకు నిర్మించిన సొరంగ మార్గంలో నీళ్లు లీక్ అవుతుండడం సంచలనంగా మారింది. 10.58 కి.మీ ఈ మార్గాన్ని

రూ. 13,983.83 కోట్లతో అంచనాతో ప్రారంభించారు. ఇటీవలే సొరంగమార్గం మొదటి దశను సీఎం ఏక్ నాథ్ శిండే, డిప్యుటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రారంభించారు.

మూడు నెలల క్రితమే ప్రారంభించిన ఈ సొరంగ మార్గంలో అప్పుడే గోడల నుంచి నీళ్లు లీక్ కావడం ఆందోళనకరం. దీని మీద అధికారులు ప్రస్తుతం విచారణ ప్రారంభించారు.

‘‘నేను అధికారులకు ఫోన్ చేశాను. రెండు మూడు చోట్లు నీరు లీకవుతున్న మాట వాస్తవం. ఈ విషయమై అధికారులు నిపుణులతో మాట్లాడారు. సొరంగాలకు వచ్చిన ముప్పేమీ లేదని వారు భరోసా ఇచ్చారు’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే సొరంగమార్గాన్ని సందర్శించిన సందర్భంగా అన్నారు.

‘ప్రత్యేక సాంకేతికతతో సొరంగం గోడల్లోని ఖాళీలను నింపేస్తామని, వానాకాలంలో కూడా నీరు లీకయ్యే ప్రమాదం ఉండదని, శాశ్వత పరిష్కారం చేస్తామని’ షిండే తెలిపారు.

రెండో దశ జూన్ 10న ప్రారంభించాల్సి ఉంది. 2.07 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం గిర్‌గావ్ నుంచి బ్రీచ్ కాండీ బీచ్ వరకూ సముద్రం నిర్మించారు. 12.19 మీటర్ల వ్యాసం ఉన్న ఈ సొరంగాలను నీటి ఉపరితలానికి 12 నుంచి 20 మీటర్ల లోతున నిర్మించారు. దేశంలో సముద్రం అడుగున నిర్మించిన సొరంగ మార్గంగా ఈ మార్గం అరుదైన గుర్తింపుతో అందరినీ ఆకర్షించింది.

Tags:    

Similar News