కొత్త చట్టం: ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే తబిడ దిబిడే!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా మూడు బిల్లులను లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సమీక్ష కోసం పార్లమెంట్‌ కు స్టాండింగ్

Update: 2023-08-12 12:54 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా మూడు బిల్లులను లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సమీక్ష కోసం పార్లమెంట్‌ కు స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదిత బిల్లు పంపబడింది. ఈ సమయంలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాల విషయంలో జైలు శిక్షను అందులో ప్రతిపాదించింది.

అవును... భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023 ప్రకారం.. భారతదేశ సార్వభౌమాధికారం, భద్రతకు హాని కలిగించే నకిలీ వార్తలు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తే సెక్షన్ 195 ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. సెక్షన్ 195 (1) (డీ) ప్రకారం.. మూడు సంవత్సరాల వరకు పొడిగించబడే జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.

కొత్తగా ప్రతిపాదించబడిన బిల్లులోని 11వ అధ్యాయంలో "ప్రజా ప్రశాంతతకు వ్యతిరేకంగా నేరాలు" లోని, "ఆరోపణలు, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వాదనలు" అనే అంశం క్రింద ఈ సెక్షన్స్ కి సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీసీలోని సెక్షన్ 153బీ కింద "ఆరోపణలు, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వాదనలు"కి సంబంధించిన నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే.

పౌరులకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను పరిరక్షించడమే ఈ మూడు కొత్త చట్టాల ఆత్మ అని బిల్లులను ప్రవేశపెడుతూ అమిత్ షా అన్నారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు-2023, భారతీయ సాక్ష్యా బిల్లు-2023 లే ఆ మూడు బిల్లులు.

ఈ బిల్లులు బ్రిటీష్ వారు రూపొందించిన.. ఇండియన్ పీనల్ కోడ్ - ఐపీసీ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ - సీఆర్పీసీ (1898), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (1872)లను రద్దు చేస్తాయి.

ఇందులో భాగంగా... భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థా నంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు.. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా బిల్లు రానుందని అమిత్ షా తెలిపారు.

Tags:    

Similar News