ఏపీలో "పవర్ స్టార్" మద్యం పాలిటిక్స్ వైరల్!

ఈ సందర్భంగా కామెంట్స్ సెక్షన్ లో పెద్ద యుద్ధమే నడుస్తున్న పరిస్థితి.

Update: 2024-07-02 12:59 GMT

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక వారు చేసిన తప్పులు వీరు, వీరు చేసిన తప్పులు వారు ఎత్తి చూపుతూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సందర్భంగా కామెంట్స్ సెక్షన్ లో పెద్ద యుద్ధమే నడుస్తున్న పరిస్థితి.

ఈ సమయంలో "పవర్ స్టార్" మద్యం బాటిల్ పిక్ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రత్యక్షమైంది. ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చిన కొత్త బ్రాండ్ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. దీంతో కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు వైసీపీని వాయించి వదులుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ మద్యం బాటిల్ పై ఉన్న మ్యాన్ ఫ్యాక్చరింగ్ డేట్ చూపిస్తూ ఫైరవుతున్నారు.

అవును... వైసీపీ తన అధికారిక "ఎక్స్"లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... "పవర్ స్టార్ విస్కీ.. కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్! నాణ్యమైన మద్యం అంటూ జనసైనికుల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెరపైకి తెచ్చిన చంద్రబాబు సర్కార్ ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి.. నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబూ అంటూ గగ్గోలు!" అని రాసుకొచ్చింది.

అయితే... ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చిన బ్రాండ్ అని అంటున్నారు. ఈ మేరకు నాడు ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా... మద్యపాన నిషేదం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్... ఇప్పుడు తన పేరు మీద కూడా లిక్కర్ తెచ్చారని పవన్ ఫైరయ్యారు.

ఆ సంగతి అలా ఉంటే... ఆ బాటిల్ పై మ్యాన్ ఫ్యాక్చరింగ్ డేట్ 09 జూన్ 2024 అని ఉంది. అప్పటికి ఏపీలో కొత్త ప్రభుత్వం ఇంకా కొలువుదీరలేదు! దీంతో... ఆ డేట్ ని సర్కిల్ చేసి వైసీపీపై సోషల్ మీడియా జనాలు నిప్పులు కక్కుతున్నారు. తప్పుడు ప్రచారాలు మానాలని ఒకరంటే... ఇలాంటి అనాలోచిత ఆరోపణల వల్ల ప్రయోజనం శూన్యం అని అంటున్నారు.

కాగా... ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నని రోజులూ అక్కడ అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్స్ పై ట్రోలింగ్ విపరీతంగా ఉండేదనే సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ వినని, కనని బ్రాండ్స్ ఇవని.. వాటివల్ల ఆరోగ్యం మరింత పాడైపోతుందని విమర్శలు వినిపించేవి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా లిక్కర్ విషయంలో ఆ పార్టీకి చివాట్లు తప్పడం లేదని అంటున్నారు!

Tags:    

Similar News