విశ్వసుందరిగా షెన్నిస్ పలాసియోస్... టాప్ 20లో ఇండియన్ సుందరి!

అవును... మిస్ యూనివర్స్ 2023 టైటిల్‌ ను నికరాగ్వా భామ గెలుచుకుంది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ ఈ ఏడాది ప్రపంచసుందరిగా ఎంపికైంది

Update: 2023-11-19 09:03 GMT

ప్రతిష్ఠాత్మక "మిస్‌ యూనివర్స్‌" కిరీటం ఈ ఏడాది నికరాగ్వా భామ సొంతమైంది. 72వ మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ ను నికరాగ్వాకు చెందిన భామ షెన్నిస్ పలాసియోస్ కైవసం చేసుకున్నారు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌.. ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. దీంతో "మిస్‌ యూనివర్స్‌ -2023" టైటిల్‌ సెంట్రల్ అమెరికాలో ని నికరాగ్వా దేశానికి దక్కినట్లయ్యింది!

అవును... మిస్ యూనివర్స్ 2023 టైటిల్‌ ను నికరాగ్వా భామ గెలుచుకుంది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ ఈ ఏడాది ప్రపంచసుందరిగా ఎంపికైంది. ఇక, ఈ పోటీల్లో థాయ్‌ లాండ్‌ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్‌ గా నిలవగా.. ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌ గా నిలిచారు. దీంతో, ఈ ముగ్గురు సుందరీమణులకూ నెటిజన్లు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇలా మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న తొలి నికరాగ్వా దేశ భామ షెన్నిస్ పలాసియోస్‌ కావడం విశేషం. ఈ పోటీల్లోని చివరి రౌండ్‌ లోని "ఒక ఏడాది పాటు వేరే మహిళగా జీవించాలనుకుంటే ఎవరిలా ఉండాలనుకుంటారు..?" అనే ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం హైలైట్ గా నిలిచింది. ఆ సమాధానానికి అందరూ ఫిదా అయ్యారు. దీంతో... ఈమెకు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది.

ఆ ప్రశ్నకు సమాధానంగా... "స్త్రీ హక్కుల కోసం ఎంతగానో పోరాటం చేసిన సామాజిక వేత్త మేరీ వాట్సన్ బ్రాడ్‌ ను లా జీవించాలనుకుంటా. కారణం... సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి.. ఆమె ఎంతోమంది మహిళలకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీలు అనుకుంటే ఎక్కడైనా పనిచేయగలరు కాబాట్టి... తాము కోరుకున్న రంగంలో పని చేసేందుకు మహిళలందరికీ సరైన పరిస్థితులు తీసుకురావడానికి నేను కృషి చేయాలనుకుంటున్నా" అని అన్నారు.

కాగా... ఈసారి ఎల్ సాల్వడార్ మిస్ యూనివర్స్ హోస్ట్ దేశంగా నిలిచింది. ఎల్ సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్‌ లోని 13,000 సీట్ల జోస్ అడాల్ఫో పినెడా ఎరీనాలో ఈ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. వీరిలో భారత్ నుంచి పాల్గొన్న శ్వేతా శార్దా.. టాప్ 20లో నిలిచారు.

Tags:    

Similar News