తాజా బడ్జెట్ తో నిర్మలమ్మఅరుదైన రికార్డు.. బ్రేక్ చేసేవారెవరు?

మంచి వక్తగా పేరున్న నిర్మలా సీతారామన్ మరోసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేశారు.

Update: 2024-02-01 09:23 GMT

మంచి వక్తగా పేరున్న నిర్మలా సీతారామన్ మరోసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేశారు. పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా తాజా బడ్జెట్ ప్రసంగంతో పూర్తైంది. ఈ సందర్భంగా ఆమె పలు రికార్డుల్ని క్రియేట్ చేశారని చెప్పాలి. దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా పని చేసిన ఘనతను నిర్మలమ్మ సొంతం చేసుకున్నారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

నిర్మలమ్మకు ముందు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కట్ చేస్తే.. ఇందిరమ్మ తర్వాత నిర్మలమ్మనే బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తర్వాత మళ్లీ ఒక మహిళా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు దాదాపు మూడు దశాబ్దాలకు పైనే పట్టింది. అయితే.. ఆ సమయంలో ఇందిరాగాంధీ తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉండేవారు.

తాజా బడ్జెట్ తో నిర్మలా సీతారామన్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్ లు ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా అరుదైన రికార్డును నెలకొల్పారు. ఈ ఘనతల్ని చూసిన తర్వాత నిర్మలమ్మ రికార్డుల్ని బ్రేక్ చేయటానికి మరో మహిళా నేతకు చాలానే సమయం పడుతుందన్న మాట వినిపిస్తోంది.





 


Tags:    

Similar News