కిమ్ తగ్గడం లేదు.. ఉక్రెయిన్ కు మరో షాకింగ్ న్యూస్!

ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-27 18:30 GMT
Kim Jong Uns Shocking Support for Russia

ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రష్యా అధినేత పుతిన్ తో కీలక చర్చలు జరిపారు. అయితే... మరోపక్క ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం రష్యాకు షాకింగ్ సహకారం అందిస్తూ.. యుద్ధం విషయంలో అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లున్నారని అంటున్నారు.

అవును... ఇప్పటికే ఉక్రెయిన్ తో జరుగుతున్న వార్ లో రష్యాకు తనవంతు సహకారం అందిస్తోన్న ఉత్తర కొరియా నుంచి మరో కీలక సహాయం అందిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... సుమారు 3,000 మంది సైనికులను రష్యాకు పంపించింది ఉక్రెయిన్. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం తాజాగా వెల్లడించింది.

ఇదే సమయంలో... ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తమ దేశంలో పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రష్యా విదేశాంగశాఖ సహాయ మంత్రి ఆండ్రీ రూడెంకో వెల్లడించారు. దీంతో... ఈ రెండు దేశాల మధ్య యుద్ధం విషయంలో ఉత్తరకొరియా అధినేత కిమ్ ఉద్దేశ్యం అర్ధమవుతుందనే చర్చ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో రష్యా తరఫున పోరాడేందుకు ఉత్తర కొరియా ప్రభుత్వం ఇప్పటికే సుమారు 11,000 మందిని పంపించింది. అయితే... వీరిలో సుమారు 4,000 మంది మరణించడమో, గాయపడటమో జరిగిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వెల్లడించారు.

అయితే... ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో కేవలం సైన్య సహకారమే కాకుండా.. పెద్దమొత్తంలో షార్ట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణులను కూడా ఉత్తర కొరియా ప్రభుత్వం రష్యాకు తరలించిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... 220కు పైగా 170 ఎంఎం, 240 ఎంఎం శతఘ్నులను కూడా పుతిన్ ప్రభుత్వానికి అందజేసిందని దక్షిణ కొరియా వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో... ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో గురువారం ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించారు. ఆర్టిఫిషియలో ఇంటెలిజెన్స్ తో అవి పని చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాలలో డ్రోన్ల సామర్థ్యాన్ని కిమ్ తనిఖీ చేసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News