అమెరికా కంపెనీల్లో ఉత్తర కొరియన్లు... ఆచూకీ చెబితే మిలియన్ డాలర్లు!

పైగా రష్యాతో కిమ్ రాసుకు పూసుకు తిరుగుతుండటంతో అగ్రరాజ్యం మరింత సెగలు కక్కుతుంటుందని చెబుతుంటారు.

Update: 2024-05-17 16:30 GMT

అమెరికాకూ ఉత్తర కొరియాకు ఏమాత్రం పడదనే సంగతి తెలిసిందే. పైగా రష్యాతో కిమ్ రాసుకు పూసుకు తిరుగుతుండటంతో అగ్రరాజ్యం మరింత సెగలు కక్కుతుంటుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే కిమ్‌ సామ్రాజ్యానికి అసలు అంతర్జాతీయ కరెన్సీ "డాలర్‌"తో బంధాన్ని కత్తిరించేసింది అమెరికా! ఉత్తర కొరియాను అమెరికా ఆస్థాయిలో దూరం పెడితే... ఇప్పుడు ఒక సంచలన విషయం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... అమెరికాలోని కొన్ని టెక్‌ ఉద్యోగాల్లో అమెరికన్ల ఐడీలతో పలువురు ఉత్తర కొరియన్లు రహస్యంగా చేరారని.. వారంతా స్వదేశం నుంచే వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారని.. ఈ క్రమంలో వారి జీతాలు వారి కరెన్సీలోనే ఉత్తర కొరియాకు చేరేట్లు చేస్తున్నారని తేలిందంట. పైగా ఈ మొత్తం వ్యవహారంలో ఓ అమెరికా మహిళ సాయం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారని అంటున్నారు. దీంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది.

అవును... అమెరికాకు - ఉత్తరకొరియాకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని అరిజోనాకు చెందిన క్రిస్టీనా మారీ చాప్‌ మన్‌ అనే మహిళ.. ముగ్గురు ఉత్తరకొరియా వాసులు స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు సాయం చేసిందని అధికారులు గుర్తించారట. దీనికోసం అమెరికన్ల ఐడీలను దొంగిలించి మరీఇ వారికిచ్చిందని అంటున్నారు.

ఫలితంగా వారంతా వర్క్‌ ఫ్రం హోం చేసేలా టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ఈ జాబ్స్ ద్వారా వచ్చిన సొమ్మును వారు ఉత్తరకొరియాకు చేర్చారు. దాని మొత్తం సుమారు 68 లక్షల డాలర్లు ఉంటుందని అధికారులు గుర్తించారని అంటున్నారు. ఉత్తర కొరియాకు చెందిన ఈ ముగ్గురూ ఉద్యోగులు వారి దేశంలోని ఆయుధ పరిశ్రమతో సంబంధాలున్నవారని చెబుతోంది.

ఇందులో భాగంగా... వీరితో ఉ.కొరియాలో సంబంధం ఉన్న ఆ సంస్థలు బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమాలను, ఆయుధ పరిశోధనలను పర్యవేక్షిస్తుంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని అమెరికా అధికారులు మరింత సీరియస్ గా తీసుకున్నారు. దీంతో... ఉత్తర కొరియాకు చెందిన జీహో హాన్‌, హౌరనుజు, చుంజీ జిన్‌ ఆచూకీ చెబితే 5 మిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News