జూనియర్ మౌనం... టీడీపీలో అసహనం!
అయితే జూనియర్ అనుసరిస్తున్నా ఈ విధానమే టీడీపీకి తీవ్ర అసహనం కలిగిస్తోంది. జూనియర్ ఒక్క మాట.
జూనియర్ ఎన్టీయార్ తన సినిమాలు తాను అన్నట్లుగా ఉన్నారు. అది మంచి లైన్. ఆయన వరకూ ఓకే. ఆయన అలవి కాని వయసులో కాని కాలంలో రాజకీయాల్లోకి వచ్చి రాంగ్ రూట్ అనుకున్నారు. పాతికేళ్ళకే టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని 2009లో చేసి దాని చేదు ఫలితాన్ని అందుకున్నారు.
ఆ తరువాత ఆయన తండ్రి నందమూరి హరిక్రిష్ణ టీడీపీలో 1983 నుంచి జరిగినదేంటి అన్నది జూనియర్ కి చెప్పే వుంటారు. 2018లో హరిక్రిష్ణ చనిపోయేనాటికి ఏపీలో అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలో ఏమీ కారు. ఆయనకు ఏ పదవీ లేదు. దాంతో తండ్రి హరిక్రిష్ణ 1995 ఎపిసోడ్ లో బాబు సీఎం కావడానికి చేసిన మేలు ఆ మీదట ఆయనకు ఏమీ దక్కకపోవడం వంటివి కూడా అందరికీ తెలిసినవే.
మరి జూనియర్ కి సొంతంగా కొన్ని అనుభవాలు ఉన్నాయని అంటారు. 2009లో పార్టీకి విశేషంగా ప్రచారం చేసిన తరువాత ఏకంగా చావు అంచులలోకి వెళ్ళి జూనియర్ బయటపడ్డారు. ఆ తరువాత 2011 లో హైదరాబాద్ లో జరిగిన మహానాడులో లోకేష్ ఫ్లెక్సీలు అంతటా పెట్టడం జూనియర్ బొమ్మ ఎక్కడా లేకపోవడంతో నాడు హరిక్రిష్ణ మహానాడు వేదిక నుంచే బాయ్ కాట్ చేశారు. అది కూడా చరిత్రలో పదిలంగా ఉంది.
ఇక 2014 ఎన్నికల వేళ టీడీపీకి జనసేన సపోర్టు, మోడీ ఇమేజ్ అన్నీ కలసి వచ్చి మంచి ఊపు మీద ఉంది. ఆ టైం లో జూనియర్ ప్రచారానికి వస్తారా అని అడిగితే ఎవరినీ బొట్టు పెట్టి పిలిచేది లేదు అంటూ అప్పటికే యాక్టివ్ అయిన నారా లోకేష్ జవాబు చెప్పారని ఒక ప్రచారం ఉంది. ఇక 2018 నాటికి నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి అయిదు శాఖలకు మంత్రి కావడం ద్వారా బాబు వారసుడు టీడీపీకి భవిష్యత్తు అని తేలిపోయిన సందర్భం కూడా అంతా చూశారు. 2019 ఎన్నికల వేళ సైతం జూనియర్ ప్రచారానికి రాలేదు.
ఒక విధంగా చెప్పాలీ అంటే జూనియర్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉందా లేదా అన్నది పక్కన పెడితే టీడీపీలో ఆయన ప్లేస్ ఏంటి అనంది తెలియకుండా రారనే అంటారు. ఇక సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూ ట్రిపుల్ ఆర్ తో గ్లోలబ్ స్టార్ ఇమేజ్ సాధించిన జూనియర్ కి సినీ పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంది. ఇవన్నీ ఫణంగా పెట్టి ఆయన టీడీపీ సైడ్ తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించి ఒక సెక్షన్ గా మిగలాలని అనుకోవడంలేదు అంటున్నారు.
ఇక గతంలో కొన్ని కీలక సందర్భాలలో జూనియర్ చేసిన ట్వీట్లలో కూడా మంచి చెడ్డలను ఎక్క దీసి మరీ విమర్శించారు. ఆయన ఇంకా బాగా ట్వీట్ చేయాలని కూడా టీడీపీలో కొందరు భాష్యం చెప్పారు. అంటే టీడీపీ వారికి నచ్చిన విధంగా జూనియర్ ఉండలేరు కదా. ఆయనకంటూ సొంత పంధా ఉంది అందుకే ఆయన మౌనాన్నే ఆశ్రయించారు అని అంటున్నారు.
రాజకీయాలు అన్న తరువాత అనేకం జరుగుతూ ఉంటాయి. వాటికి రియాక్ట్ కావాల్సింది రాజకెయ పార్టీల నేతలే. జూనియర్ విషయం తీసుకుంటే ఆయాన్ పూర్తిగా వాటిని అవాయిడ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక సారి రియాక్ట్ అయి మరోసారి కాకుండా ఉంటే అది ఇబ్బంది అవుతుంది. అందుకే ఆయన నో పాలిటిక్స్ అన్న స్టాండ్ తీసుకున్నారు అని అంటున్నారు.
అయితే జూనియర్ అనుసరిస్తున్నా ఈ విధానమే టీడీపీకి తీవ్ర అసహనం కలిగిస్తోంది. జూనియర్ ఒక్క మాట. ఒక్క ట్వీట్ ఎంత పవర్ ఫుల్ అన్నది కూడా అందరికీ తెలుసు అంటారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా జూనియర్ ని పిలిపించుకుని మరీ డిన్నర్ చేశారు. అది ఎన్టీయార్ మనవడు రేంజి అని చెబుతారు. మరి మరో మనవడు అదే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు అని ప్రచారంలో ఉన్న మాట.
ఎవరెన్ని అనుకున్నా జూనియర్ పాలిటిక్స్ లోకి రారు అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. నా కట్టె కాలే వరకు టీడీపీతోనే అని ఒకసారి జూనియర్ చెప్పారని, ఇక ఆయన ప్రతీ రోజూ రాజకీయాలు మాట్లాడాలా అని అంటున్నారు. అయితే జూనియర్ విషయంలో టీడీపీ బాధ ఒక వైపు ఉంటే ఆయన సైలెంట్ ఏమిటి అంటూ మీడియా నుంచి వచ్చే ప్రశ్నలు ఆ పార్టీ వారికి తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయని అంటున్నారు.
అచ్చెన్నాయుడు అయితే జూనియర్ నే పోయి అడగమని అనడం కూడా అందులో భాగమే అంటున్నారు. మొత్తానికి బాబు అరెస్ట్ రిమాండ్ తరువాత ఇపుడు జూనియర్ కూడా బాగా చర్చకు వస్తున్నారు. ఆయన ప్రమేయం లేకుండానే అన్నీ అలా సాగిపోతున్నాయి అంతే అంటున్నారు ఫ్యాన్స్.