నిన్న మణిపూర్ - నేడు హర్యానా... తీవ్రంగా మారిన పరిస్థితి!

నుహ్‌ జిల్లాలో మొదలైన రచ్చ కాస్తా మిగతా ప్రాంతాల కు వ్యాపించింది. ఈ సందర్భంగా రాళ్ల దాడులు, తుపాకీ కాల్పులతో మరో టెన్షన్ వాతావరణం నెలకొందని తెలుస్తోంది.

Update: 2023-08-01 10:11 GMT

నిన్నమొన్నటివరకూ మణిపూర్ లో జరిగిన, జరుగుతోన్న దాడుల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రెండు వర్గాల మాధ్య ఏర్పడిన వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో.. అది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయం లో తాజాగా హరియాణా లో కూడా ఇలానే రెండు వర్గాలమధ్య జరిగిన భయంకరమైన దాడుల వ్య్వహారం తీవ్ర చర్చనీయాంశమైంది!

అవును... మణిపూర్ ముగిసింది, హరియాణా లో మొదలైంది అన్నట్లుగా వ్యవహారం ఉందనే కామెంట్లు తాజాగా వినిపిస్తున్నాయి. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా... నుహ్‌ జిల్లాలో మొదలైన రచ్చ కాస్తా మిగతా ప్రాంతాల కు వ్యాపించింది. ఈ సందర్భంగా రాళ్ల దాడులు, తుపాకీ కాల్పులతో మరో టెన్షన్ వాతావరణం నెలకొందని తెలుస్తోంది.

ఇలా హరియాణా లోని మేవాత్‌ లో జరిగిన ఘర్షణల్లో అయిదుగురు మరణించారని ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక ఇమామ్ కూడా ఉన్నారు. ఈ హింసాకాండలో పోలీసుల తో దాదాపు 45 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ విధించినట్లు హోం మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు.

ఇదే సమయం లో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ ఈ వ్యవహారం పై స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాల ని కోరారు.. బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో... వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్‌ పై ఆంక్షలు విధించారు.

మసీదుకు నిప్పు.. ఇమామ్ మృతి!:

మేవాత్‌ లో మతపరమైన హింస తర్వాత, గురుగ్రామ్‌ లోని సెక్టార్ 57లో ఉన్న మసీదు కు నిప్పు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ దాడి లో ఒక ఇమం మృతిచెందినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో తాము కేసు పెడతామని.. ఏడు నెలలుగా తమ అన్నయ్య మసీదు లో ఇమామ్‌ గా పని చేస్తున్నాడని ఇమామ్ మౌలానా సాద్.. సోదరుడు షాదాబ్ అన్వర్ చెబుతున్నాడని తెలుస్తోంది.

అసలు గొడవ ఎక్కడ స్టార్టయ్యింది..?:

తాజాగా హరియాణా లో విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో బ్రిజ్‌ మండల్‌ జలాభిషేక యాత్ర మొదలైంది. ఈ యాత్ర సోమవారం గురుగ్రామ్‌ - అల్వార్‌ జాతీయ రహదారి మీదుగా నుహ్‌ జిల్లా నంద్‌ గ్రామానికి చేరుకోంది. ఈ సమయం లో ఓ వర్గానికి చెందిన యువకులు ఈ యాత్రను అడ్డుకున్నారని తెలుస్తోంది.

దీంతో ఇరు వర్గాల వారి మధ్య గొడవ మొదలవ్వగా.. అది చినికిచినికి గాలివానలా మారింది. ఈ అల్లర్లకు బజరంగ్‌ దళ్‌ కు చెందిన ఓ కార్యకర్త సోషల్‌ మీడియాలో చేసిన పోస్తే కారణం అని అంటున్నారు. గోరక్షక్‌ గా చెప్పుకొనే ఆ కార్యకర్త మరో వర్గానికి చెందిన జంట హత్యల కేసు లో అనుమానితుడిగా ఉన్నాడని తెలుస్తోంది.

అతడు ఇటీవల ఓ వీడియోలో.. శోభాయాత్రలో అందరూ పాల్గొనాల ని పిలుపునిచ్చాడు. ఇదే సమయం లో తాను కూడా యాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. అనంతరం... తనను ఆ యాత్రలో పాల్గొనకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటూ బహిరంగ సవాల్‌ చేశాడు. ఇదే మరో వర్గం వారికి ఆగ్రహాన్ని తెప్పించిందని.. ఫలితంగా శోభాయాత్రను అడ్డుకొని దాడులకు దిగారని కథనాలొస్తున్నాయి!

Tags:    

Similar News