రేవంత్ రెడ్డి కూతురా మజాకా!

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న అంటారు. మంచి మనసుండాలే కానీ ఏదైనా చేయొచ్చు

Update: 2024-05-09 06:44 GMT

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న అంటారు. మంచి మనసుండాలే కానీ ఏదైనా చేయొచ్చు. మంచి మనసు అందరికి ఉండదు. ఉన్నా దాన్ని అందరికి పంచే గుణం కొందరికే ఉంటుంది. అనాథల పాలిట ప్రేమ చూపించే వారే నిజమైన ప్రేమకలిగినవారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిశా రెడ్డి తన ఉదారతను చాటుకుని తనకు మంచి మనసు ఉందని నిరూపించుకుంది.

స్టేడియంలో క్రికెట్ చూడాలనే అనాథల కోరికను తీర్చి తన గొప్ప మనసు చాటుకుంది. తనతో పాటు 30 మంది అనాథలను చిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను తిలకించేందుకు వారిని తీసుకెళ్లింది. వారితో కలిసి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసింది. ఇలా అనాథల పాలిట ఆమె చూపిన కరుణ వారు ఎప్పటికి మరచిపోలేరు.

తమ అభిమాన ఆటగాళ్లను దగ్గర నుంచి చూసినందుకు వారు కూడా సంతోషంగా ఫీలయ్యారు. మాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించిన రేవంత్ రెడ్డి కూతురును ప్రశంసించారు. ఆమె గొప్ప మనసుకు ఉప్పొంగారు. మాలాంటి వాళ్లను ఎవరు దగ్గరకు తీసుకోరు. కానీ ఆమె చూపిన ప్రేమకు మురిసిపోయారు. తమకు ఆట చూసేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఆటగాళ్లను చూసి పిల్లలు ఉప్పొంగిపోయారు. వారి సంబరాలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కూతురుకు ఇంత మంచి మనసు ఉందా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. తండ్రికి తగ్గ తనయ అని కీర్తిస్తున్నారు. అనాథలను చేరదీయడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.

అనాథలతో మ్యాచ్ చూడాలనే ఆమె ఆలోచనకు హ్యాట్సాప్. సేవా గుణం ఉంటే అలాగే చేస్తారు. అనాథ పిల్లలను తీసుకుని మ్యాచ్ కు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా సహనం ఉండాలి. ధైర్యం కావాలి. అలాంటి పని ఆమె చేయడం నిజంగా విశేషమే.

Tags:    

Similar News