సోషల్ మీడియాలో పోస్టులు... మాజీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు శిక్ష!

'సోషల్ మీడియాలో పోస్టులు - వారిపై లీగల్ చర్యలు' అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ ఓ కీలక పరిణామం తెరపైకి వచ్చింది.

Update: 2024-12-03 04:38 GMT

సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పని చేసిన మాజీ ఎమ్మెల్యేకు తాజాగా కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది.

అవును... 'సోషల్ మీడియాలో పోస్టులు - వారిపై లీగల్ చర్యలు' అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ ఓ కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తమిళనాడు భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే హెచ్. రాజాకు జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... 2018లో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తానని.. ఎంపీ కనిమొళిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో రెండు పోస్టుపు పెట్టారు హెచ్.రాజా! ఈ రెండింటిపైనా పలు పోలీస్ స్టేషన్స్ లో డీఎంకే నాయకులు, తందై పెరియార్ ద్రావిడ కళగం నాయకులు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

దీంతో... వీటిని రద్దు చేయాలని కోరుతు మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన హెచ్ రాజాకు ఎదురుదెబ్బ తగిలింది. వాటిని రద్దు చేయాలంటూ ఈయన వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో... వీటిపై విచారణ మూడు నెలల్లో పూర్తి చేయాలని చెన్నై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు సూచించింది.

దీంతో... తాజాగా విచారణ ముగించిన ప్రత్యేక న్యాయస్థానం జడ్జి... తీర్పు వెలువరించారు. రాజాపై వచ్చిన ఆరోపణలను పోలీసులు రుజువు చేశారని, ఆయన ఈ రెండు కేసుల్లోనూ దోషి అని తీర్పులో పేర్కొన్నారు. దీంతో.. రెండు కేసుల్లో చెరో ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News