ఆపరేషన్ "తలాష్"... తల్లి కోసమని 9మంది మహిళలను చంపాడు!!

ఈ సమయంలో ఈ హత్యలు చేసున్న కిల్లర్ ని పట్టుకునేందుకు ఆపరేషన్ "తలాష్" ను చేపట్టారు పోలీసులు.

Update: 2024-08-11 12:33 GMT

జూలై 2023 - జూలై 2024 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి సమీపంలోని గ్రామల్లో మహిళలు వరుసగా హత్యలకు గురవుతున్నారు. పొలాల్లోనూ, అటవీ ప్రాంతంలోనూ ఒంటరిగా పనిచేసుకుంటున్న మహిళలే లక్ష్యంగా ఈ హత్యలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో ఈ హత్యలు చేసున్న కిల్లర్ ని పట్టుకునేందుకు ఆపరేషన్ "తలాష్" ను చేపట్టారు పోలీసులు.

ఈ సీరియల్ కిల్లర్ సుమారు 13 నెలల వ్యవధిలో 9 మంది మహిళలను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సమయంలో అతడి కోసం సుమారు 22 బృందాల పొలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లక్షకు పైగా ఫోన్ నెంబర్లు, వేల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏది ఏమైతేనే సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ "తలాష్" సక్సెస్ అయినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్ లో కుల్దీప్ కుమార్ గంగ్వార్ అనే 38 ఏళ్ల వయసున్న వ్యక్తి ఉన్నాడు. అతడు పదమూడు నెలల వ్యవధిలో 9 మంది మహిళలను హతమార్చాడు. పొలాల్లో ఒంటరిగా పనిచేస్తున్న మహిళలే లక్ష్యంగా ఈ వ్యవహారం సాగించాడు. ఒంటరిగా కనిపించిన మహిళ దగ్గరకు వెళ్తాడు.. వారికి లైంగిక చర్యకు ప్రపోజ్ చేస్తాడు.. వారు అంగీకరించని పక్షంలో గొంతు నులిమి చంపేస్తాడు.

దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం మహిళలు ఒంటరిగా తిరగడానికి భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చాడని చెబుతున్నారు. ఈ 13 నెలల కాలంలో ఈ సీరియల్ కిల్లర్ గురించి కథలు కథలుగా చెప్పుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆపరేషన్ ‘తలష్’ చేపట్టిన పోలీసులకు ఈ ఏడాది జూలైలో ఓ టిప్ వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు పక్క స్కెచ్ వేశారు.

ఈ మేరకు శీష్ గఢ్ - షాహి పోలీస్ స్టేషన్ ల మధ్యలో పాతిక కిలోమీటర్ల రేడియస్ ను మార్క్ చేసుకున్న పోలీసులు... ఆ ప్రాంతంలోనే తీవ్ర గాలింపు చేపట్టారు. దీని కోసం సుమారు 22 బృందాలను ఏర్పాటు చేశారు. మరోపక్క సుమారు లక్షన్నర అనుమానాస్పద ఫోన్ నెంబర్లు స్కాన్ చేశారు.. సుమారు పదిహేను వందల సీసీ కెమెరాలను మానిటర్ చేశారు.. ఫైనల్ గా అతడిని పట్టుకున్నారు.

తెరపైకి మదర్ సెంటిమెంట్!:

ఇలా ఆపరేషన్ తలాష్ దర్యాప్తులో భాగంగా మరో కీలక విషయం బయటకు వచ్చిందని చెబుతున్నారు. అసలు ఇంత పక్కాగా ప్లాన్ చేసి, ఇంత కిరాతకంగా ఒంటరిగా దొరికిన దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ కి చెందిన మహిళలనే ఎందుకు చందుతున్నాడు అనే విషయాలపై ఆరాతీయగా.. ఓ బలమైన కారణం బయటపడిందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... ఈ సీరియల్ కిల్లర్ తల్లి బ్రతికున్న రోజుల్లో తన తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడంట. అనంతరం.. రెండో భార్య కోరిక మేరకు మొదటి భార్యను తరచూ హింసించేవాడంట. దీంతో.. నిందితుడికి సవతి తల్లి పట్ల ద్వేషం కలిగింది. దీంతో... ఆ వయసులో ఉన్న మహిళలను టార్గెట్ చేసి అంతమొందించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పటికి 9 మందిని బలి తీసుకున్నాడు!

Tags:    

Similar News