ఈ హామీలకు కాలం చెల్లు: పబ్లిక్ టాక్ ఏంటంటే
ఇలా పాత హామీలను.. పాత సెంటిమెంట్లను తెరమీదికి తెస్తూ.. చేసే ఈ రాజకీయం ఎంత వరకు వర్కవు ట్ అవుతుందనేది చెప్పడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.
రాజకీయాలు రాజకీయాలే.. ప్రజల నాడి ప్రజలదే. రాజకీయాల్లో నాయకులు మాటలు మార్చొచ్చు.. లేదా.. కుప్పిగంతులు వేయొచ్చు. కానీ, ప్రజల నాడిని మాత్రం పసిగట్టడంలో విఫలమవుతున్నారనేది తెలంగా ణ సహా.. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే కళ్లకు కట్టాయి. ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి.. పాత హామీలే తెరమీదికి వస్తున్నాయి. అన్ని పార్టీలూ దాదాపు.. పాత చింతకాయ్ పచ్చడి మాదిరిగా పాత హామీలనే వల్లెవేస్తున్నాయి.
ఇలా పాత హామీలను.. పాత సెంటిమెంట్లను తెరమీదికి తెస్తూ.. చేసే ఈ రాజకీయం ఎంత వరకు వర్కవు ట్ అవుతుందనేది చెప్పడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. తెలంగాణలోనూ ఇదే తరహా సెంటిమెంట్లు, హామీలు తెరమీదకి వచ్చాయి. తెలంగాణ సెంటిమెంటును మరోసారి తెరమీదికి తెచ్చారు. అంతేకాదు.. ఇంకేముంది.. మేం లేకపోతే.. రాష్ట్రం ఏమై పోతుందో.. ప్రజలకు తిండి కూడా దొరకదని ఎన్నికల వేళ కీలక నాయకులు ప్రచారం హోరెత్తించారు.
అయితే.. అన్నింటినీ గమనించిన ప్రజలు ఏం చేయాలో అదే చేశారు. కట్ చేస్తే.. ఏపీలోనూ ఇలాంటి కొన్ని హామీలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిని మరోసారి తెరమీదికి తీసుకురావాలని.. కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆయా హామీలను గతంలో ఈ పార్టీలు కూడా వదిలేసి నవే కావడం గమనార్హం. దీంతో ప్రజలు కూడా ఇప్పుడు ఆయా అంశాలపైనే చర్చిస్తున్నారు. ఉదాహరణ కు ప్రత్యేక హోదా. ఇది అన్ని పార్టీలూ వల్లెవేసిన ప్రధాన హామీ.
ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో ఒకరు పోలిస్తే.. మరొకరు ఇదే మహాద్భుతమని.. హోదాతో ఏం వస్తుం దని అన్నారు. ఇక, తమను గెలిపిస్తే.. హోదా తప్పకుండా దిగి వస్తుందని మరికొందరు చెప్పారు. చివరా ఖరికి.. ఈ హామీని అటకెక్కించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి.. ఈ హామీల కత్తులకే పదును పెడుతున్నారు. ఇక, పోలవరం, విశాఖ మెట్రో, వెనుక బడిన జిల్లాలు, కడప ఉక్కు.. ఇలా చెప్పుకొంటూ పోతే.. చాలానే ఉన్నాయి.
కానీ ఇవన్నీ.. గత ఎన్నికల్లో ప్రధానంగా తెరమీదికివచ్చినవే. అయితే.. అవి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో వీటిపై జనాలు ఇప్పుడు ఆశలు వదిలేసుకున్నారు. సో.. ఇవి నెరవేరుతాయా? లేదా? అనేది పక్కన పెడితే.. వీటిని మాత్రం జనాలు లైట్ తీసుకుంటుండడం గమనార్హం. దీంతో వీటిని ప్రస్తావించడం కన్నా..కొత్త హామీలపై దృష్టి పెడితే బెటరేమో.. అంటున్నారు పరిశీలకులు.