జగన్ తో ఒవైసీ...రాజకీయ సంచలన భేటీ...!
ఏపీ సీఎం జగన్ తో మజ్లిస్ అధినేత ఓవైసీ భేటీ అవుతారు అంటూ ఒక ప్రచారం తాడేపల్లి చుట్టూ చక్కర్లు కొడుతోంది
ఏపీ సీఎం జగన్ తో మజ్లిస్ అధినేత ఓవైసీ భేటీ అవుతారు అంటూ ఒక ప్రచారం తాడేపల్లి చుట్టూ చక్కర్లు కొడుతోంది. అది నిజంగా జరిగితే మాత్రం రాజకీయ పెను సంచలనమే అని అంటున్నారు. మజ్లీస్ అధినేత ఒవైసీ తన పార్టీని విస్తరించే క్రమంలో దేశంలో చాలా చోట్ల పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఏపీలో మాత్రం ఎపుడూ పోటీ చేయలేదు.
ఇక చూస్తే 2024 ఎన్నికల్లో ఓవైసీ ఏపీ నుంచి పోటీకి తన అభ్యర్థులను దించుతారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు జగన్ తో ఓవైసీ భేటీ అవుతారు అన్నది రాజకీయంగా అత్యంత కీలకమైన విషయంగా ఉంది. నిజం చెప్పాలంటే ఓవైసీకి జగన్ కి మధ్య రాజకీయంగా ఉమ్మడి ప్రయోజనాలు అయితే ఏమీ లేవు.
జగన్ ది ఏపీ అయితె ఒవైసీదె హైదరాబాది. అక్కడ ఆయన కంచుకోటను నిర్మించుకున్నారు. జగన్ అయితే తెలంగాణా రాజకీయాలను వదిలేసి చాలా కాలం అయింది. ఈ నేపధ్యలో హైదరాబాద్ లో కానీ లేక విజయవాడలో కానీ జగన్ని ఎపుడూ ఒవైసీ కలసిన దాఖలాలు అయితే లేవు
కానీ ఇపుడు సడెన్ గా జగత్ తో ఒవైసీ భేటీ కానున్నారు అన్న వార్తలు మాత్రం రాజకీయంగా ప్రకంపలను సృష్టిస్తున్నాయి. జగన్ ఇంటికి అంటే తాడేపల్లికి ఓవైసీ వస్తారని ఇద్దరు నేతలూ భేటీ అవుతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలూ మధ్యాహ్న భోజనం కూడా కలసి చేస్తారని ఆ వార్తలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కనుక నిజమైతే మాత్రం రాజకీయంగా ఆశ్చర్యంగానూ ఉంటాయని అంటున్నారు. ఈ లంచ్ మీటింగ్ ఏ రకమైన రాజకీయ సందేశాన్ని ఇస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది. అయితే జగన్ని ఒవైసీ ఎందుకు కలుస్తున్నారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. అయితే జగన్ ఆహ్వానం మేరకే ఓవైసీ తాడేపల్లికి వస్తున్నారు అని అంటున్నారు.
ఏపీలో మరోసారి గెలిచేందుకు వైసీపీ ఎంతో ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఏపీలో పోటీ చేస్తే విపక్షాల ఓట్ల చీలిక కూడా సాధ్యపడి మళ్లీ వైసీపీ గెలిచేందుకు వీలు అవుతుందని భావిస్తున్నారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఓవైసీ తనకు ఉన్న హాస్పిటల్ వ్యాపారాన్ని ఏపీలో కూడా విస్తరించేందుకు జగన్ని కలుస్తున్నారు అని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు అసలు ఈ భేటీ అన్నది కనుక జరిగితే రాజకీయంగా మాత్రం చాలానే సమీకరణలు మరుతాయని అంటున్నారు.