సరోగసీపై ఆ దేశ ప్రధాని వ్యాఖ్యలు... తెరపైకి సూపర్ మార్కెట్ సరుకులు!

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పందించారు.

Update: 2024-04-14 03:44 GMT

ఇటీవల కాలంలో చాలామంది దంపతులు సరోగసీ ద్వారానే తల్లితండ్రులు అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి రావడానికి కారణాలు ఏవైనప్పటికీ.. దంపతులు కాస్తా తల్లితండ్రులుగా మారడానికి ఇదొక మార్గం ఉండటం వారికి కలిసివస్తోందని చెబుతున్నారు! సర్రోగేట్ ద్వారా ఒక బిడ్డకు జన్మనివ్వడం తమకు అమిత ఆనందాన్ని ఇచ్చిందని పలువురు సెలబ్రెటీలు చెబుతుంటారు కూడా!

ఈ లిస్ట్ లో ప్రపంచానికి తెలిసే సెలబ్రెటీలు, ప్రపంచానికి తెలియని సామాన్యులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పందించారు. ఇందులో భాగంగా... సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందడం అమానవీయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సరోగసిపై ఈమె చేసిన ఈ కామెంట్లు తీవ్ర వైరల్ గా మారుతున్నాయి!

అవును... సరోగసీ విధానం ద్వారా మాతృత్వాన్ని పొందడం అమానవీయమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పద్ధతిలో జన్మించిన పిల్లల్ని సూపర్ మార్కెట్ ఉత్పత్తులుగా పరిగణిస్తారని ఘాటుగా స్పందించారు. గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడాన్ని తాను ఇప్పటికీ అమానవీయంగానే భావిస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

ఇందులో భాగంగా... ఒకరి గర్భాన్ని అద్దెకు తీసుకోవడం స్వేచ్ఛాచర్య అని చెప్పి తనను ఒప్పించలేరని.. పిల్లల్ని సూపర్‌ మార్కెట్‌ లో ఉత్పత్తిగా పరిగణించడాన్ని ప్రేమ అంటూ ఎవరూ తనకు సర్దిచెప్పలేరని మెలోనీ స్పందించారు. ఇదే సమయంలో... గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడాన్ని తాను ఇప్పటికీ అమానవీయంగానే భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో... ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరంగా మార్చే బిల్లుకు తన మద్దతు ఉంటుందని చెప్పడం గమనార్హం. కాగా... సరోగసీ ప్రక్రియ ఇప్పటికే ఇటలీలో శిక్షార్హం. ఈ క్రమంలో... అధికార పక్షం ఈ నిబంధలను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా... ఈ విధానం చట్టబద్ధమైన దేశాల్లో కూడా ఇటలీ ప్రజలు పిల్లల్ని కనకుండా ఈ బిల్లు నిషేధించనుంది!

Tags:    

Similar News