నూజివీడు వైపు పార్ధసారధి... టీడీపీ తమ్ముళ్ళలో కలవరం...!?

వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కె పార్ధసారధికి ఇపుడు టీడీపీలో సీటు కష్టాలు మొదలయ్యాయి.

Update: 2024-01-29 04:55 GMT

వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కె పార్ధసారధికి ఇపుడు టీడీపీలో సీటు కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు జగన్ పెనమలూరు సీటు ఇవ్వను అని చెప్పారు. అక్కడ ఆయన గ్రాఫ్ బాలేదని తేల్చారు. దాంతో బహిరంగ సభలోనే జగన్ మీద వివాదాస్పద కామెంట్స్ చేసిన పార్ధసారధి ఆ మీదట ఆ పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు.

ఇటీవల ఆయన చంద్రబాబుని కలుసుకుని టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. అయితే పార్టీ కండువా మాత్రం కప్పుకోలేదు. రాజ్యసభ ఎన్నికలు దగ్గరలో ఉండడంతోనే తెలివిగా చేస్తున్నారు అని అంటున్నారు. టీడీపీలోకి వెళ్తే ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది. దాంతో ఆయన వెయిట్ చేస్తున్నారు.

ఇక పెనమలూరు నుంచి మళ్ళీ పోటీకి పార్ధసారధి రెడీ అయితే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఇంచార్జి బోడె ప్రసాద్ పెద్ద బ్రేక్ వేసేసారు. పార్టీలో చేరితే ఓకె కానీ టికెట్ మాత్రం ఇస్తే గొడవలు అవుతాయని ఇండైరెక్ట్ గానే హెచ్చరించారు. ఒక విధంగా అది పెద్ద వివాదంగానే మారుతోంది.

దీంతో చంద్రబాబు సూచనల మేరకు ఇపుడు పార్ధసారధి నూజివీడు వైపు షిఫ్ట్ అయ్యారని అంటున్నారు. నూజివీడులో టీడీపీ తరఫున పార్ధసారధి పోటీకి అధినాయకత్వం సుముఖంగా ఉందిట. అక్కడ తమ్ముళ్ళను మంచి చేసుకోమని చెప్పి పంపించిందని అంటున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా పార్ధసారధి నూజివీడుకి వచ్చి స్థానిక టీడీపీ నేతలతో భేటీ వేస్తూ గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో అక్కడ టీడీపీ ఇంచార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఈ పరిణామాల మీద గుర్రుగా ఉన్నారు. పార్ధసారధిని తన మీదకు తెస్తున్నారు అని ఆయన గ్రహించి అర్జంటుగా తన అనుచరులతో మీటింగ్ పెట్టారని అంటున్నారు. పార్ధసారధికి టికెట్ ఇవ్వవద్దు అని అపుడే ముద్దరబోయిన వర్గం డిమాండ్ చేస్తోంది.

స్థానికంగా ఉంటూ పార్టీ కోసం పదేళ్ళుగా కష్టపడుతున్న తమను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ఎలా టికెట్ ఇస్తారని వారు అంటున్నారు. అయితే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టీడీపీ రెండు సాలు ఇప్పటికే చాన్స్ ఇచ్చింది. ఆయన 2014, 2019లలో ఓటమి పాలు అయ్యారు. అక్కడ వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీ తరఫున మేక వెంకట ప్రతాప్ అప్పారావు గెలుస్తూ వస్తున్నారు.

ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు. దాంతో ఆయనకే మళ్లీ టికెట్ వైసీపీ ఇస్తోంది. ఇపుడు ఆయన్ని ఓడించాలంటే పార్ధసారధి సరైన వారు అని టీడీపీ హై కమాండ్ భావిస్తూ ఆయన్ని పంపిస్తోందని అంటున్నారు. అయితే ముద్దరబోయినకు మంచి బలం ఉంది. ఆయన రెండు సార్లూ ఎనభై అయిదు వేలకు పైగా ఓట్లను సాధించారు. ఆయన్ని కాదనుకుంటే మాత్రం టీడీపీకి గెలుపు కష్టమే అంటున్నారు.

దాంతో ఆయన్ని మంచి చేసుకోవాల్సి ఉంది. కానీ తనకు టికెట్ కాకుండా ఎవరికో ఇస్తే పనిచేయబోమని ముద్దరబోయిన వర్గం సంకేతాలు పంపిస్తోంది. అపుడు సీరియస్ డెసిషన్ తీసుకుంటామని అంటోంది. అంటే ఆయన టీడీపీని వీడిపోతారని అంటున్నారు. మొత్తానికి పార్ధసారధికి సీటు చూపించాలంటే అధినాయకత్వానికి కష్టంగా ఉంది అని అంటున్నారు.





 


Tags:    

Similar News