ఎయిర్ హోస్టెస్ తో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన..అరెస్టు
ఎయిర్ హోస్టెస్ ను తాగుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఇటీవలి కాలంలో విమానాల్లో ప్రయాణికులు, విమాన సిబ్బంది, పైలట్ల వ్యవహార శైలి వివాదాస్పదమవుతునన సంగతిత తెలిసిందే. విమానాల్లోని సీట్లలో..ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇక, విమాన ప్రయాణంలో సహ ప్రయాణికులపై, సిబ్బందిపై కొందరి వికృత చేష్టలు జుగుప్స కలిగిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీకి వస్తోన్న విమానంలో క్యాబిన్ సిబ్బందితోపాటు తోటి మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ ఘటన మరువకముందే తాజాగా మాలీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో మహిళా సిబ్బందితో ఓ ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎయిర్ హోస్టెస్ ను తాగుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అతడిని బెంగళూరు పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున మాలీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ లో మాల్దీవులకు చెందిన అక్రమ అహ్మద్ అనే ప్రయాణికుడు మద్యం కావాలని ఎయిర్ హోస్టెస్ ను అడిగాడు.
దీంతో, అహ్మద్ కు మద్యం గ్లాసు ఇచ్చేందుకు అతడి దగ్గరకు వెళ్లిన సమయంలో ఎయిర్ హోస్టెస్ తో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యకర రీతిలో తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ క్రమంలోనే అతడి ప్రవర్తనను ప్రశ్నించేందుకు వచ్చిన మిగతా విమాన సిబ్బందిపై కూడా అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడు. వారిపై కూడా లైంగిక వేధింపులకు దిగాడు. చివరకు విమానం బెంగళూరుకు చేరుకున్న తర్వాత విమాన సిబ్బంది అతడిపై సిఐఎస్ఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో, స్థానిక పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.