పటాన్ చెరులో మూడుముక్కలాట !

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో పటాన్ చెరు నియోజకవర్గం ప్రస్తుతం ఒక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటుంది

Update: 2024-07-16 07:03 GMT

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో పటాన్ చెరు నియోజకవర్గం ప్రస్తుతం ఒక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటుంది. గత శాసనసభ ఎన్నికల్లో పటాన్ చెరు శాసనసభ స్థానం నుండి బీఆర్ఎస్ తరపున మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపు నుండి కాట శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ తరపున నీలం మధులు పోటీ చేశారు.

బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించిన నీలం మధు అక్కడ సిట్టింగులకే సీట్లు అనడంతో కాంగ్రెస్ లో చేరి చివరి వరకు ప్రయత్నించి అక్కడ కాటా శ్రీనివాస్ కే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో చివరకు బీఎస్పీ తరపున పోటీలో నిలబడ్డాడు. ఈ ఎన్నికల్లో 7091 స్వల్ప తేడాతో మహిపాల్ రెడ్డి విజయం సాధించాడు. కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ 98296 ఓట్లు, నీలం మధు 46162 ఓట్లు సాధించారు. తన ఓటమికి నీలం మధు కారణం అన్న కోపం కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఉంది.

శాసనసభ ఎన్నికల తర్వాత నీలం మధు తిరిగి కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. నీలం మధును ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు కాట శ్రీనివాస్ సతీమణి తీవ్రంగా వ్యతిరేకించింది.

ఈ పరిణామాలన్నీ ఇలా ఉన్న సమయంలో బీఆర్ఎస్ నుండి గెలిచిన మహిపాల్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఓడిన కాటా శ్రీనివాస్, ఎంపీగా ఓడిన నీలం మధు ఉన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మహిపాల్ రెడ్డి చేరడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పటాన్ చెరులో ఇక నుండి పైచేయి ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News