తెలంగాణా ఎన్నికల పీక్ టైం లో విశాఖకు పవన్...!

విశాఖలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నలభై దాకా బోట్లు పూర్తిగా దగ్దం అయ్యాయి.

Update: 2023-11-21 09:29 GMT

జనసేన అధినేత ఇపుడు తెలంగాణా ఎన్నికల విషయంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన జనసేన తరఫున నిలబడుతున్న అభ్యర్ధులకు ప్రచారం చేస్తారు అన్నది జన్సేన వర్గాల భోగట్టా. ఇక తెలంగాణా ఎన్నికల ప్రచారానికి వ్యవధి కూడా ఎక్కువ లేదు.

దాంతో నిజం చెప్పాలంటే పవన్ ప్రచారం చేయదలచుకుంటే ఆయనకు క్షణం తీరిక లేని విధంగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మనసు మాత్రం ఏపీ మీదనే ఉంది అనడానికి ఒక ఉదాహరణ ఇది. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నలభై దాకా బోట్లు పూర్తిగా దగ్దం అయ్యాయి. అలాగే మరో అరవై పడవలు పాక్షికంగా దగ్దం అయ్యాయి.

దీంతో బాధితులను ఆదుకునేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగుతున్నారు. ఈ ప్రమాదంలో బోట్లు పూర్తిగా దహనం అయి ఆర్ధికంగా చితికిపోయిన మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికీ యాభై వేల వంతున ఆర్ధిక సాయం చేయడానికి పవన్ నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల వ్యవధిలో పవన్ విశాఖ రానున్నారు. స్వయంగా తానే ఆర్ధిక సాయం చేయనున్నారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సందేశాన్ని పంపించారు. మొత్తం నలభై పడవలు దహనం అంటే ఇరవై లక్షల దాకా పవన్ అర్ధిక సాయం చేస్తారు అని అంటున్నారు. అలాగే పాక్షికంగా దహనం అయిన పడవలకు కూడా పవన్ ఆర్ధిక సాయం చేస్తారని అంటున్నారు. మొత్తానికి పవన్ అతి పెద్ద మొత్తాన్ని అరధిక సాయం రూపంలో చేయనున్నారని అంటున్నారు.

ఒక వైపు తెలంగాణా ఎన్నికల వేడి రాజుకున్న వేళ పవన్ ఏపీ మీద దృష్టి సారించడం మత్స్యకారులకు తమ వంతుగా సాయం అందించడం విశేషం అంటున్నారు. పవన్ ఈ వారాంతంలో విశాఖ వస్తారని తెలుస్తోంది. ఇక పవన్ తెలంగాణా ఎన్నికల ప్రచారం కూకటి పల్లితో పాటు మరిన్ని నియోజకవర్గాలలో రోడ్ షోలు చేస్తారని అంటున్నారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు పవన్ ఆయా సభలలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే విపక్షాలు అన్నీ ప్రభుత్వం సాయం చేయాలని డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో పవన్ తానుగా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ముందుకు వచ్చి ఆర్ధిక సాయం చేయడం అన్నది ఆలోచించాల్సిన విషయం అంటున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు, అయినా మత్స్యకారులకు తీరని అన్యాయం జరిగింది. ఈ కీలక వేళ ప్రభుత్వం ఎంటూ 80 శాతం పైగా ఒక్కో బోటు యజమానికీ నష్ట పరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చింది. విపక్షాలు కూడా తమ వంతుగా సాయం చేస్తే తిరిగి మత్య్సకార కుటుంబాలలో ఆనందం వెల్లి విరుస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News