బాబు మరో పదేళ్ళు....పవన్ సీఎం అయ్యేదెప్పుడు ?

టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారం కొత్త కాదు, ఆయన నలభై అయిదేళ్ల వయసులోనే ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు.

Update: 2024-11-20 15:04 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారం కొత్త కాదు, ఆయన నలభై అయిదేళ్ల వయసులోనే ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్లో అతి పిన్న వయసులో సీఎం అయిన రికార్డు ఆయన క్రియేట్ చేశారు. అది లగాయితూ 2024లో ఆయన గెలిచి నాలుగవ సారి సీఎం అయ్యారు. బాబు వయసు ఇపుడు డెబ్బయి అయిదేళ్ళు.

అయితే బాబుకు నో ఏజ్. ఆయనకు మిగిలిన వారిలా వయసు బాధ లేదు. ఆయన ఈ రోజుకీ యంగ్ అండ్ డైనమిక్ సీఎం గానే ఉంటారు. ఆయనని ఈ విధంగా చూస్తే మరో పది పదిహేనేళ్ళ పాటు చాలా చురుకుగా రాజకీయాల్లో ఉంటారని అందరూ అంటారు. అలా బాబు ఏపీకి సీఎంగా మరింత కాలం సేవలు అందించే విధంగా హెల్త్ ఆయనకు ఉంది.

టీడీపీ వారు కూడా అదే కోరుకుంటారు. బాబే ఎల్లకాలం సీఎం గా ఉండాలన్నది వారి కోరిక. ఎందుకంటే వారికి బాబు ఆరాధ్య దైవం. అయితే బాబు సీఎం గా ఉండాలని ఈ అయిదేళ్ళు మాత్రమే కాదు మరో పదిహేనేళ్ల పాటు అంటే టోటల్ గా పదిహేనేళ్ళ పాటు అని మిత్రపక్షం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు.

ఇదే ఇపుడు అతి పెద్ద వైరల్ న్యూస్ గా ఉంది. బాబు సీఎం కావాలని బలంగా ఒక మిత్రపక్షం కోరుకోవడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక్కడ అంతా మెచ్చాల్సింది పవన్ గురించే. ఈ రోజులలో కాదు ఏ రోజులలో అయినా పదవుల మీద మోజు లేని వారు ఎవరు ఉంటారు. కీర్తి కాంత కనకం అని అందుకే అన్నారు

వీటి మీద మోజు లేని వారు ఉండబోరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వీటిని తాను అతీతం అని ఏపీ అసెంబ్లీ సాక్షిగా గట్టిగా నిరూపించుకున్నారు. ఒక విధంగా చూస్తే రాజకీయాల్లోనే ఆయన సరికొత్త డెఫినిషన్ గా నిలిచారు. మిత్రుడు అంటే ఆయనే అన్నట్లుగా కూడా కనిపించారు.

ఏపీ సీఎం గా ఎప్పటికైనా తాను కావాలని పవన్ కి కోరిక ఉందో లేదో తెలియదు కానీ ఆయన చెప్పిన మాట వింటే మరో దశాబ్దన్నర పాటు బాబే సీఎం గా ఉంటారు. మరి పవన్ కి చాన్స్ ఎపుడు అంటే దానికి ఈ టైం లో జవాబు లేదు, కానీ జనసైనికులు ఈ విషయంలో ఓకే అంటారా అన్నదే చర్చ. తన అధినాయకుడు చెప్పిన మాటతో ఏకీభవిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

ఎందికంటే వారికి పవన్ హీరో. ఆయనను సీఎం గా చూసుకోవాలనే వారుకు నూరు శాతం ఉంటుంది. అంతదాకా ఎందుకు పవన్ రాజకీయాలలోని వచ్చిన 2014 నుంచి వారు సీఎం అని నినాదాలు ఇస్తూనే ఉన్నారు. అయితే పవన్ కూడా వారి కోరికను తోసిపుచ్చకుండా ఆ రోజు వచ్చినపుడు అవుతాను అన్నట్లుగా మాట్లాడేవారు. ఇక 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగానే ప్రొజెక్ట్ చేసుకుంటూ పవన్ పోటీకి దిగారు.

కానీ 2024 ఎన్నికలలో మాత్రం బాబు సీఎం అవుతారని అందరూ ఊహించి ఓట్లు వేశారు. ఆనాడు పవన్ అన్నది ఏపీకి బాబు లాంటి అనుభవం కలిగిన నాయకత్వం అవసరం అని. అంతే కాదు సీఎం గా కాదు వైసీపీని గద్దె దించడమే ఇపుడు ముఖ్యమని క్యాడర్ కి చెప్పారు.

పవన్ మాటను వారు మన్నించి కూటమి విజయానికి దోహదపడ్డారు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని వారు అనుకుంటున్నారు. పవన్ గురించి జానీ మాస్టర్ లాంటి వారు ఒక వేదిక మీద చెప్పిన మాటలు జనసైనికుల మనోభావాలుగా చూసుకుంటే కనుక 2029 నాటికి ఆయనే సీఎం అన్నది వారి బలమైన నమ్మకం. కానీ పవన్ అయితే 2029, 2034లో కూడా బాబే సీఎం అని అంటున్నారు

మరి ఇది వారికి డైజెస్ట్ అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. అంతే కాదు పవన్ వెనక ఉన్నది ఒక బలమైన సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ సీఎం అయ్యే చాన్స్ అయితే రాలేదు. దాంతో వారు పవన్ లో తమ ఆశలను పెట్టుకుని చూసుకుంటున్నారు. పవన్ జనసేన టీడీపీ పొత్తు కూడా రాజకీయ వ్యూహంలో భాగమని వారు నమ్ముతున్నారు.

ముందు బలం పెంచుకుని ఆ తరువాత పవన్ సీఎం అవుతారన్నది కూడా ఆ సామాజిక వర్గం వేసుకుంటున్న అంచనా. ఒక వేళ కూటమిగా కొనసాగినా పవర్ షేరింగ్ అన్నది జనసేనకు దక్కి పవన్ ఏదో నాటికి సీఎం అయి తీరుతారని కూడా విశ్వసిస్తున్నారు. కానీ పవన్ మాత్రం చాలా బోల్డ్ గా అసెంబ్లీలో ప్రకటించారు

అసలు ఆ సందర్భం కూడా ఇపుడు కాదు, కానీ పవన్ చెప్పారు అంటే అది ఆయన మనసులో నుంచి వచ్చినదే. ఎలాంటి కల్మషం లేకుండా పవన్ బాబే సీఎం అని చెప్పేశారు. ఆ విషయంలో ఆయన ఎలాంటి వ్యూహాలు కూడా వేసుకోలేదని చెప్పాలి. పవన్ ఆలోచనలు నిజంగా ఉన్నతంగా ఉన్నాయని కూడా భావించాలి.

ఎందుకంటే ఏపీని పూర్తిగా అభివృద్ధి మార్గాన పరుగులు పెట్టించాలి అంటే అది బాబు వల్లనే సాధ్యమని పవన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకు కేవలం అయిదేళ్ల సమయం సరిపోదని మరో పదేళ్ళు కూడా అవసరమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన అలా ప్రకటించాల్సి వచ్చింది. ఇదంతా పవన్ బాబు దక్షతల మీద నమ్మకంతో అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎంతో మక్కువతో అని చెప్పాలి

మరి ఈ విధంగా జనసైనికులు కానీ ఒక బలమైన సామాజిక వర్గం కానీ అర్ధం చేసుకుంటే కూటమిలో బాబే దీర్ఘ కాలం సీఎం గానే ఉంటారు. ఒకవేళ అర్థం చేసుకోకపోయినా పవన్ దే ఫైనల్ డెసిషన్ కాబట్టి ఆయనను అభినందించి తీరాల్సిందే. సో కూటమి ఎన్ని సార్లు గెలిచినా బాబే సీఎం. ఇది ఎప్పటికీ ఫిక్స్ పోవాల్సిందే.

Tags:    

Similar News