అందరి కళ్ళూ పవన్ కుర్చీ మీదే...మ్యాటర్ అదే !
అయితే పవన్ మొదటిసారి కేబినెట్ మీటింగ్ కి గైర్ హాజరయ్యారు. ఆయన జ్వరంతో పాటు వెన్నునొప్పితో బాధపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా ఆయన అనేక మంత్రివర్గ సమావేశాలకు వచ్చారు. ముఖ్యమంత్రి మధ్యన ఉంటే ఆయన చెయిర్ కి కుడి వైపున పవన్ కళ్యాణ్ చెయిర్ ఉంటుంది. అలా పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్ మీటింగ్స్ కి అటెండ్ అయి తనదైన సలహా సూచనలు ఇస్తూ వచ్చారు.
అయితే పవన్ మొదటిసారి కేబినెట్ మీటింగ్ కి గైర్ హాజరయ్యారు. ఆయన జ్వరంతో పాటు వెన్నునొప్పితో బాధపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఆయనకు విశ్రాంతి అవసరం అని అందువల్ల వైద్యుల సూచనల మేరకు ఆయన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని కూడా పేర్కొంది. దాంతో పవన్ గురువారం జరిగిన మంత్రివర్గ భేటీకి హాజరు కాలేదు.
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే పవన్ ఎపుడూ కూర్చునే ఉప ముఖ్యమంత్రి కుర్చీ మాత్రం అలాగే ఖాళీగా ఉంది. దాంతో మంత్రులు అధికారులు అందరి చూపూ ఆశ్చర్యకరంగా అటు వైపే వెళ్ళింది.
నిజానికి మంత్రివర్గ సమావేశానికి ఎవరైనా గైర్ హాజరైనపుడు ఆ సీటులో వేరొకరు కూర్చుంటారు. అధికారులు టేబుల్ మీద నేమ్ ప్లేట్స్ ని దానికి తగినట్లుగా మారుస్తారు. కానీ ఫస్ట్ టైమ్ పవన్ విషయంలోనే ఇలా జరిగింది అని అంటున్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక మంత్రిగానే రాజ్యంగబద్ధంగా చూస్తే ఉన్నారు. సీఎం చెయిర్ తప్ప ఏ చెయిర్ అయినా కదపవచ్చు. ఎవరైనా అందులో కూర్చోవచ్చు కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం పవన్ కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ తో పాటు ఆయనకు ఎంతో గౌరవం కూడా ఇచ్చినట్లుగా దీనిని బట్టి అర్ధం అవుతోంది. సీనియర్ మంత్రులు ఎందరో ఉన్నా పవన్ కుర్చీ వైపు కూడా చూడకుండా తమకు కేటాయించిన సీట్లోనే ఆసీనులు అయ్యారు.
ఇది నిజంగా అరుదైన విషయం అని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనకు దాని అధినాయకుడికి ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తోందని చెబుతున్నారు. దాంతో మంత్రివర్గ సమావేశంలో పవన్ కి కేటాయించే ఖాళీ కుర్చీ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుకి ఇదే నిదర్శనం అంటున్నారు. ఇక జనసేన నేతలు, పవన్ అభిమానులు అయితే ఆయన తొందరగా కోలుకుని తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాలొగ్నాలని కోరుతున్నారు.