ఇదీ.. మా సత్తా: పవన్ కల్యాణ్
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు మాసాల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు మాసాల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనకు ప్రస్తుత తమ ఆరు మాసాల పాలనకు ముడిపెట్టి ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఏయే రంగాల్లో ఎంతెంత అభివృద్ది జరిగిందన్న విషయాన్ని ఆయన గణాంకాలతోపాటు వివరించారు. తాము ఆరు మాసాల్లోనే చేసిన అభివృద్ధిలో వీసమెత్తు కూడా.. వైసీపీ ఐదేళ్లలో చేయలేక పోయిందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొన్ని మైలురాళ్లు సాధించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. అనేక రూపాల్లో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నామన్నారు. అదేవి ధంగా గ్రాంట్లు కూడా సాధించినట్టు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న తలంపు ఉండబట్టే కాలంతో సంబంధం లేకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు. కేవలం ఆరు మాసాల కాలంలోనే అనేక రూపాల్లో పనులు పూర్తి చేశామని వివరించారు.
పవన్ చెప్పిది ఇదీ..
+ ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కింద వైసీపీ ఐదేళ్ల పాలనలో 1800 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించింది.
+ మేం(ఎన్డీయే) అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే 3,750 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాం.
+ వైసీపీ ఐదేళ్ల పాలనలో మినీ గోకులాలు కేవలం 268 ఏర్పాటు చేసింది.
+ మా ఆరు నెలల పాలనలోనే 22,500 మినీ గోకులాలను నిర్మించాం.
+ పీవీటీజీ ఆవాసాల కోసం వైసీపీ రూ.91 కోట్లు ఖర్చు చేసింది.
+ ఎన్డీయే హయాం ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు చేసింది.