జగన్ బలపడకుండా టోటల్ బాధ్యతలు పవన్ తీసుకున్నారా ?

ఏపీలో తెలుగుదేశం కూటమిలో రెండవ అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. ఎన్డీయేకు నమ్మకమైన మిత్రుడిగా పవన్ నిలిచారు.

Update: 2025-02-07 01:30 GMT

ఏపీలో తెలుగుదేశం కూటమిలో రెండవ అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. ఎన్డీయేకు నమ్మకమైన మిత్రుడిగా పవన్ నిలిచారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత కాలం అధికారంలో ఉండాలని కనీసంగా పదిహేనేళ్ళు అయినా ఏపీలో అధికారంలో ఉంటే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని పవన్ భావిస్తున్నారు. ఆయన దీని మీద అనేక సార్లు ప్రకటనలు కూడా ఇచ్చారు.

ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకూడదని పవన్ గట్టిగా భావిస్తున్నారు. వైసీపీ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదని ఆయన అలా ఆలోచిస్తున్నారు అని అంటారు. ఇక ఈ విషయంలో ఆయన తన నిబద్ధతను చాటుకుంటున్నారు. కూటమిలో ఎలాంటి పొరపొచ్చాలు చోటు చేసుకోకుండా చూసేందుకు తానే ఎక్కువగా తగ్గి ఉంటున్నారు అని కూడా చెబుతారు.

పదవుల మీద తనకు ఎలాంటి వ్యామోహం లేదని ఇటీవల జనసేన క్యాడర్ కి ఆయన రాసిన బహిరంగ లేఖ కూడా వైరల్ అయింది. ఏపీ అభివృద్ధి తనకు ముఖ్యమని పవన్ స్పష్టంగా చెప్పారు. ఇదిలా ఉంటే వైసీపీకి రాయలసీమ రీజియన్ లో బలం ఉంది. ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీ ఓడినా ఎక్కువ ఓటు షేర్ అక్కడే దక్కింది. . తక్కువ మార్జిన్ తోనే అక్కడ చాలా సీట్లు వైసీపీ కోల్పోయింది. దాంతో మళ్ళీ పుంజుకోవడం అన్నది పెద్ద కష్టం కాదని వైసీపీ భావిస్తోంది.

దీంతో రాయలసీమలో వైసీపీ తిరిగి బలపడకుండా చూసేందుకు పవన్ కొత్త వ్యూహాలను రచిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీని సీమ జిల్లాల్లో కట్టడి చేస్తే ఏపీ రాజకీయాల్లో కూటమికి తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఇప్పటికే గోదావరి జిల్లాలలో జనసేన బలంగా ఉంది ఉత్తరాంధ్రాలో కూడా విస్తరిస్తోంది.

దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో బలం పెంచుకుంటే ఫ్యూచర్ లో పార్టీకి అది హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే నాగబాబుతో జనంలోకి జనసేన తొలి మీటింగ్ ని రాయలసీమలోని చిత్తూరు జిల్లా పుంగనూరులో పెట్టించారు అని చెబుతునారు. ఇక మార్చి నెలలో జనసేన పెద్ద ఎత్తున ప్లీనరీని నిర్వహిస్తోంది.

ఈ ప్లీనరీ తరువాత పవన్ జిల్లాల టూర్లు పెట్టుకుంటారు అని అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలోనే ఎక్కువగా పవన్ పర్యటించేలా జనసేన ప్రణాళికలు రచిస్తోంది అని అంటున్నారు.

రాయలసీమలో బలిజ సామాజిక వర్గం అధికంగా ఉంది. వారిని జనసేన వైపు తిప్పుకుంటే అక్కడ గట్టి పట్టుని సాధించవచ్చు అన్నది పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఉంది అని అంటున్నారు. అదే విధంగా వైసీపీకి దన్నుగా ఉన్న బలమైన మరో ప్రధాన సామాజిక వర్గాన్ని కూడా జనసేన వైపు తిప్పుకుంటే వైసీపీని పూర్తి స్థాయిలో నిలువరించవచ్చు అన్నది ఒక ఎత్తుగడగా ఉంది అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే అందరి చూపూ జనసేన మూడు రోజుల ప్లీనరీ మీద ఉంది అని అంటున్నారు. ఈ ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసే విధంగానే జనసేన ప్లీనరీలో నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News