సమర్థనలు తప్ప.. పవన్‌కు మరో మార్గం లేదు.. !
కానీ, ఇప్పుడు సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక.. ప్రతి ఒక్కరూ నిర్భయంగా స్పందిస్తున్నారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సనా తన ధర్మానికి ఆయన ప్రతినిధి అయినట్టు మాట్లాడుతున్నారని.. మెజారిటీ మేధావులు.. విద్యావంతులు, యువత కూడా చెడుగుడు ఆడేస్తున్నారు. ఒకప్పుడు భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని అడ్డంకులు ఉండేవి. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక.. ప్రతి ఒక్కరూ నిర్భయంగా స్పందిస్తున్నారు. వారి అభిప్రాయాలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ చేసిన ప్రాయశ్చిత్త దీక్ష నుంచి తిరుపతిలో ఆయన నిర్వహించిన వారాహి సభ వర కు అనేక రూపాల్లో విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సమర్థనలు ఉన్నా.. అవి విమర్శల ముందు కొట్టుకుపోతున్నాయి. అయితే.. ఇక్కడ పవన్ వ్యక్తిగత జీవితంపై ఎవరూ కామెంట్లు చేయకపోవడం మాత్ర మే హర్షించదగిన విషయం. ఇది మినహా .. పవన్‌ను ఏకేస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. సనాతన ధర్మంతోపాటు లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ స్పందించిన తీరును ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.
లడ్డూ వివాదంపై తొలుత సీఎం చంద్రబాబు స్పందించారు. అయితే.. దీనిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం వివాదాలకు కారణమవుతారా? అని నిలదీసింది. దీంతో టీడీపీ నాయకులు యూటర్న్ తీసుకున్నారు. `ఆయన మీడియా ముందు యధాలాపంగా వ్యాఖ్యానించారు` అని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. కానీ, పవన్ విషయం అలాకాదు. తాను ఎన్నో పుస్తకాలు చదివానని.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆచితూచి స్పందిస్తానని అధ్యయనం చేశాకే మాట్లాడతానని అనేక సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు.
ఈ పరిణామాలే సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు రావడానికి కారణమైంది. లడ్డూ వివాదం వచ్చి నప్పుడు.. ఏ అధ్యయనం ప్రకారం పవన్‌విమర్శలు చేశారన్నది ప్రశ్న. సరే.. ఈ సోషల్ మీడియా ప్రశ్నలు , విమర్శల సంగతి పక్కన పెడితే.. అసలు సీఎం చంద్రబాబు ఒక ప్రకటన చేసిన తర్వాత.. పవన్ సమర్థించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. కాదని ఆయన దూరమైతే.. జనసేనకే నష్టం. ఎందుకంటే.. టీడీపీకి చాలినన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి.
ఏ పార్టీ మద్దతు లేకపోయినా.. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండే భారీ మెజారిటీ 134 సీట్లు ఉన్నాయి. కాబట్టి.. పవన్‌కు సమర్థించడం తప్ప మరో మార్గం అయితే కనిపించడం లేదన్నది జనసేన టాక్. అంతేకాదు.. పవన్ కనుక విభేదిస్తే.. అది ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా వైసీపీకి మేలు చేసినట్టేనని చెబుతున్నారు. అందుకే.. ప్రస్తుతం పవన్‌కు సమర్థనలు తప్ప.. మరో మార్గం లేదని కుండబద్దలు కొడుతున్నారు.