ముద్రగడ మీద పవన్ ఇండైరెక్ట్ కామెంట్స్...!

కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి గోదావరి జిల్లాల పెద్దాయన ముద్రగడ పద్మనాభం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా అయినా హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-03-07 13:16 GMT

కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి గోదావరి జిల్లాల పెద్దాయన ముద్రగడ పద్మనాభం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా అయినా హాట్ కామెంట్స్ చేశారు. నాకు ఒకనాడు సలహాలు ఇచ్చే వారు అంతా ఇపుడు వైసీపీలో చేరిపోతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ ఇంటికి వైసీపీ కీలక నేతలు వెళ్లి ఆయనను ఆహ్వానించిన నేపధ్యంలో పవన్ ఈ కామెంట్స్ చేయడం రాజకీయంగా చర్చకు వస్తోంది.

ఇలాంటి వారు తనకు సలహా సూచనలు ఇస్తున్నారు అని ఆయన ఎత్తి పొడిచారు. వీరి సలహాలు తనకు ఎపుడూ అవసరం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కొన్ని కులాలలో ఐక్యత లేకపోవడం వల్లనే జగన్ కి ఊడిగం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. తనకు కూడా పెద్ద కుటుంబం పలుకుబడి డబ్బు ఉన్నాయని పవన్ గుర్తు చేశారు.

వాటిని అన్నింటినీ తాను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానను ఆయన చెప్పుకున్నారు. తనకు తెలుగు జాతే అతి పెద్ద కుటుంబం అని పవన్ మరోసారి స్పష్టం చేశారు. అంటే తనను ఒక సామాజిక వర్గానికి అంటగట్టవద్దని ఆయన సూచించినట్లుగా ఈ కామెంట్ ఉందని అంటున్నారు.

ఇక మాజీ మంత్రులు ముద్రగడ చేగొండి హరిరామజోగయ్య వంటి వారి మీద పవన్ సెటైర్లు పరోక్షంగా అలాగే కొనసాగాయని అంటున్నారు. వీరు తనకు సలహాలు చెబుతూ తాము మాత్రం వైసీపీలోకి వెళ్ళడాన్ని అంతా చూస్తున్నారు అని ఫైర్ అయ్యారు. చేగొండి హరి రామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ జనసేన నుంచి వైసీపీలోకి చేరిన సంగతి విధితమే.

వీరంతా అవసరాల మేరకే మాట్లాడే వ్యక్తులు అంటూ పవన్ చేసిన కామెంట్స్ కూడా సంచలనం రేపుతున్నాయి. ఇలాంటి వారితో తనకు అసలు అవసరం లేదు అని పవన్ అనడం కూడా ఆలోచింపచేసేలా ఉంది అంటున్నారు. తనకు రాజకీయం తెలుసు అని ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎక్కడ పోటీ చేయాలి ఎలా రాజకీయాలు చేయాలి అన్నది ఎవరూ చెప్పాల్సింది లేదని పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక పవన్ ముద్రగడ చేగొండి వంటి వారికి మరో పరోక్ష సూచన కూడా చేసినట్లు ఉంది. ఇక మీదట కాపుల రిజర్వేషన్ల గురించి కానీ ఇతర అంశాల గురించి కానీ ఒక పద్ధతి ప్రకారం ఎవరైనా మాట్లాడాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ వీరి గురించేనా అన్న చర్చ వస్తోంది. మొత్తానికి చూస్తే పవన్ తనదైన ధోరణిలో ఇవ్వాల్సినవి ఇచ్చేశారు. చెప్పాల్సినవి చెప్పేశారు. గోదావరి జిల్లాలలో కాపు పెద్దలుగా ఉన్న వారికి ఆయన ఈ విధంగా తన రాజకీయం తన ఇష్టం అని చెబుతూనే వారి వైఖరిని కూడా ఎండగట్టారు అని అంటున్నారు.

Tags:    

Similar News