పవన్ కి భారీ కౌంటర్...జగన్ కోర్టులోనే బాల్
ఇక ఈ వారంలో చూస్తే ముఖ్యమంత్రి జిల్లాల టూర్లు ఉన్నాయి. అక్కడ ఏదో ఒక చోట సభలలో ఆయన మాట్లాడుతారు. ఆ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ కి బాకీ తీరుస్తారు అని అంతా అంచనా కడుతున్నారు.
వారాహి రధయాత్ర పేరిట గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ టూర్ పూర్తి అయింది. ఆయన ఈసారి ఏ రీజియన్ లో తన టూర్ స్టార్ట్ చేస్తారో ఇంకా తెలియదు. దాని కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో జనసేన ఉంది. ఈలోగా కొంత విరామం ప్రకటించినట్లే అని అంటున్నారు. ఈ నేపధ్యంలో జగన్ జిల్లాల టూర్లు ఉన్నాయి.
పవన్ మొదటి విడత రెండవ విడతలలో జగన్ మీద ఫుల్ డోస్ పెంచేసుకుంటూ వెల్లారు. అది మీటింగ్ టూ మీటింగ్ కి హీటెత్తించింది. జగన్ కి గళ్ళ లుంగీ వేయించి పచ్చ చొక్కా తగిలించాలని పవన్ చాలా రఫ్ కామెంట్స్ చేశారని అంటున్నారు.
జగన్ పదవ తరగతి పరీక్షల పేపర్లను ఎత్తుకెళ్లారని మరో దారుణమైన ఆరోపణ చేశారు. పెళ్ళాల గురించి తప్ప భార్యల గురించి జగన్ కి ఏమి తెలుస్తుంది అని తణుకు సభలో చెడుగుడు ఆడారు. జగన్ ఏమి చదువుకున్నారని నిలదీశారు.
మొత్తానికి జగన్ కి గౌరవం ఇవ్వను జగ్గూ అంటాను, ఇంకా దిగజారాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ పవన్ ఒక ఫుల్ స్టాప్ ప్రస్తుతానికి పెట్టారు. పవన్ మీద వైసీపీ మంత్రులు అంతా కలసి మాటలతో దాడి చేసినా ఎక్కడా ఏమీ ఆనలేదు. పైగా పవన్ ధాటి ముందు అవన్నీ తేలిపోతున్నాయి. మరో వైపు వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా జగన్ వైపు చూస్తున్నారు.
దాదాపుగా నెల రోజులుగా పవన్ జగన్ని ఏమీ కానట్లుగా లైట్ తీసుకుని హాట్ కామెంట్స్ చేస్తూంటే అందులో పదవ వంతు కూడా వైసీపీ నుంచి కౌంటర్లు పడలేదన్న ఆవేదన వారిలో ఉంది. ఇక ఈ వారంలో చూస్తే ముఖ్యమంత్రి జిల్లాల టూర్లు ఉన్నాయి. అక్కడ ఏదో ఒక చోట సభలలో ఆయన మాట్లాడుతారు. ఆ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ కి బాకీ తీరుస్తారు అని అంతా అంచనా కడుతున్నారు.
తనను ఏకవచనంతో పిలవడం రౌడీ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, తన చదువుని వెక్కిరిస్తూ తన మీద పేపర్లను ఎత్తుకెళ్ళారని నేరాలు మోపడం వంటి వాటికి ఒక్క దెబ్బతో జగన్ నుంచి రిటార్ట్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. రాజకీయాలు ప్రస్తుతం వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపధ్యం ఉంది. మాటకు మాట అప్పచెప్పకపోతే వెనకబడే పరిస్థితి ఉంటుంది.
దాంతో వైసీపీ అధినేత సీఎం అయిన జగన్ నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్ గా పవన్ మీద ఘాటు విమర్శలు చేస్తారని అంటున్నారు. అలా జరగాలని కోరుకుంటున్నారు. ఈ నెల 20 తేదీన జగన్ జిల్లా టూర్ ఉన్న నేపధ్యంలో పవన్ కి భారీ కౌంటర్ పడుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఆ దిశగా జగన్ సమాయత్తం అవుతున్నారా లేదా అన్నది ఆ మీటింగ్ బట్టే తెలుస్తుంది.