పవన్ కి జాతీయ ఇమేజ్ వచ్చిందా ?

జనసేన ఒక ప్రాంతీయ పార్టీ. పదేళ్ల క్రితం పెట్టిన పార్టీకి 2024లో అపూర్వ విజయం దక్కింది.

Update: 2024-10-10 03:56 GMT

జనసేన ఒక ప్రాంతీయ పార్టీ. పదేళ్ల క్రితం పెట్టిన పార్టీకి 2024లో అపూర్వ విజయం దక్కింది. పొత్తులో తీసుకున్న 21 సీట్లనూ గెలుచుకుని బలమైన ప్రాంతీయ పార్టీగా ఏపీలో కుదురుకుంది. దాని ఫలితంగా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా లభించింది. అంతే కాదు విశేషమైన అధికారం కూడా దక్కింది.

దానిని చూసిన మీదటనే వైసీపీ నుంచి కూడా చేరికలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అలా తన పార్టీని ఏపీలో బలోపేతం చేసుకుని 2029 నాటికి జనసేనను ఏపీలో గట్టిగా నిలబెట్టాలని పవన్ సంకల్పంతో ఉన్నారు అని అంటున్నారు. అయితే సడెన్ గా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మారుమోగారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూని చంద్రబాబు లేవనెత్తినా దాని వల్ల పొలిటికల్ గా దూకుడు చేసి జాతీయ మీడియాలో నానింది మాత్రం పవన్ కళ్యాణే. ఆయన సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు, అలాగే సనాతన ధర్మం బోర్డుని ఏర్పాటు చేయాలని చేసిన డిమాండ్, తిరుపతిలో వారాహి డిక్లరేషన్ పేరిట ఆయన చేసిన గర్జన ఇవన్నీ కూడా పవన్ ని జాతీయ స్థాయిలో వేరే పొలిటికల్ లుక్ లో నిలబెట్టాయి.

నిజానికి హిందూత్వ అన్నది బీజేపీకి ఉన్న పేటెంట్ రైట్. ఆ వైపు మిగిలిన పార్టీలు చూడవు, ట్రై చేయవు. ఇపుడు అదే బాటలో పవన్ పయనిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. పవన్ హిందువుల కోసం చేసిన వ్యాఖ్యలు కానీ సనాతన ధర్మం మీద ఆయన చేసిన హాట్ కామెంట్స్ కానీ నేషనల్ మీడియాలో బిగ్ డిబేట్ కి కారణం అయ్యాయి.

అలా పవన్ సౌత్ నుంచి హిందూత్వ ఐకాన్ గా న్యూ అవతార్ గా మారారని అంటున్నారు. ఈ పరిణామాలు సహజంగా బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని సరికొత్త ఆశలను లేవనెత్తాయని అంటున్నారు. సౌత్ లో పవన్ పాపులర్ సినీ హీరో. అలాగే బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆ విధమైన సామర్థ్యం కలిగిన పవన్ సనాతన ధర్మం పేరుతో బిగ్ సౌండ్ చేయడం బీజేపీకి కొత్త నేస్తాన్ని అందించినట్లు అయింది.

పవన్ ఇప్పటికే బీజేపీకి మిత్రుడు. ఇపుడు ఐడియాలజీ పరంగా కూడా ఇంకా దగ్గర అయ్యారని అంటున్నారు. రానున్న రోజులలో పవన్ ఇదే రకమైన సీరియస్ నెస్ తో పనిచేస్తారని కూడా నమ్ముతున్నారు. ఆయన వెనక బీజేపీ వారు ఉన్నారా అన్నది ప్రత్యర్ధుల అనుమానం అయితే కావచ్చు కానీ పవన్ లో ఒక్కసారి కనిపించిన ఈ ఫైర్ ని మాత్రం ఆరిపోనీయకుండా దానితోనే కొత్త రాజకీయ కాంతులు చూసుకుంటూ ఆ వెలుగులో తన రాజకీయ లక్ష్యాలను పండించుకోవాలని బీజేపీ తప్పకుండా చూస్తుంది అని అంటున్నారు.

పవన్ సైతం బలమైన హిందూత్వ వాదంతో తనకు లభించిన ఈ జాతీయ ఇమేజ్ ని అంత సులువుగా వద్దు అనుకోరని, ఆయన వ్యూహాలు రాజకీయాలు కూడా ఇక మీదట జాగ్రత్తగా గమనించాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి శ్రీవారి లడ్డూలలో కల్తీ అని చంద్రబాబు లేవనెత్తిన ఇష్యూ కాదు కానీ పవన్ మాత్రం నేషనల్ ఫిగర్ అయిపోయారు అని అంటున్నారు. బీజేపీకి కూడా ఇపుడు పవన్ ని చూసి పూర్తి ధీమా వచ్చిందని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే రాజకీయ పరిణామాలు రానున్న రోజులలో ఏ మలుపు తిరుగుతాయన్నది వేచి చూడాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News