కోన‌సీమ‌లో కొత్త పాయింట్ లేవ‌నెత్తిన పీకే!

అయితే.. ఆయ‌న సాధార‌ణ ప్రసంగం కాకుండా.. కొత్త విష‌యాలు.. కొంగొత్త పాయింట్లు లేవ‌నెత్తారు.

Update: 2024-04-12 01:30 GMT

కోన‌సీమ జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం కూట‌మి(బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ) నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగించారు. అయితే.. ఆయ‌న సాధార‌ణ ప్రసంగం కాకుండా.. కొత్త విష‌యాలు.. కొంగొత్త పాయింట్లు లేవ‌నెత్తారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యాలు కూడా తెలియని స్థానికులు ఆశ్చ‌ర్య‌పోయారు. వీటిలో 1) కొబ్బ‌రి బోర్డు. 2) గంగా బోండాల కొబ్బ‌రి చెట్లు. ఈ రెండు ప్ర‌ధాన విష‌యాల‌పై ప‌వ‌న్ టార్గెట్ చేశారు.

1) కొబ్బ‌రి బోర్డు: కోన‌సీమ అంటే.. కేర‌ళ త‌ర్వాత‌.. ఆ రేంజ్‌లో కొబ్బ‌రి చెట్ల‌ను వృత్తిగా చేసుకున్న రైతులు ఉన్నారు. ఇక్క‌డ నుంచి బారీ ఎత్తున రాష్ట్రంలో కొబ్బరి బొండాలు ఎగుమ‌తి అవుతాయి. అయితే.. ఇలాంటి చోట‌.. `కొబ్బ‌రి బోర్డు` లేద‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. బోర్డును ఏర్పాటు చేయాల‌న్న భావ‌న కూడా.. వైసీపీ ప్ర‌భుత్వం చేయ‌లేద‌న్నారు. మంద‌ల మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ఒక్క‌రూ ఇలాంటి ఆలోచ‌న చేయ‌లేద‌న్నారు. తాము అదికారంలోకివ చ్చిన త‌ర్వాత‌.. బోర్డును ఏర్పాటు చేయిస్తామ‌న్నారు.

ఏంటీ బోర్డు?

భారీ ఎత్తున ఒక త‌ర‌హా పంట‌లు పండే ప్రాంతాల్లో ఆయా పంట‌ల‌ను నిల్వ చేసుకునేందుకు, వివిధ రూపాల్లో ప్రాసెస్ చేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం బోర్డులు ఏర్పాటు చేస్తుంది. దీనిలో ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఐదుగురు వ్య‌వ‌సాయ శాఖ అధికారులు ఉండి.. రైతుల‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తూ. పంట‌లు న‌ష్ట‌పోకుండా.. మ‌రిన్ని లాభాలు తెచ్చుకునేలా చేస్తారు. తెలంగాణ‌లోని నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డు దీనికి ఉదాహ‌ర‌ణ‌. అయితే.. ఇక్క‌డ ఏర్పాటు చేయ‌లేదు. దేశంలో ఒక్క కేర‌ళ‌లో మాత్రమే కొబ్బ‌రి బోర్డు ఉంది. ఇది కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌.

2) గంగా బొండాలు: కొబ్బ‌రి బొండాల్లో ఇది మేలు ర‌కం. ఒక్క బొండాకు ర‌మార‌మి రెండు లీట‌ర్ల నీళ్లు వ‌స్తాయి. వీటికి డిమాండ్ ఎక్కువ‌. అయితే.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. ఈ మొక్క‌లు స్తానిక కోన‌సీమ రైతుల‌కు అంద‌కుండా.. చేస్తున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు త‌మ ఫామ్ హౌస్‌ల‌లో పెంచుకునేందుకు తీసుకువెళ్తున్నార‌ని.. ఈ మొక్క‌ల పెంప‌కంపై కూడా.. అన‌ధికార ఆంక్ష‌లు విధిస్తున్నార‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. రైతుల‌కు మేలు జ‌రిగేలా ఈ మొక్క‌ల‌ను అంద‌రికీ అందుబాటులో ఉండేలా చూస్తారు. ఈ రెండు పాయింట్లు కూడా.. కొత్త కావ‌డంతో కోన‌సీమ రైతుల్లో చ‌ర్చ ప్రారంభ‌మైంది.

Tags:    

Similar News