అదీ పవన్ అంటే.. హీరోయిజాన్ని ఎంత సింఫుల్ గా తేల్చేశారంటే?

ఇంతకూ ఆ సీన్ ఏమంటే.. ఒక వ్యక్తి గాజు గ్లాస్ కిందకు పడేయటం.. అది కాస్తా ముక్కలైన వేళ ఎటకారంగా చెప్పే మాటకు అదిరే పంచ్ డైలాగ్ పవన్ నోటి నుంచి వస్తుంది.

Update: 2024-03-20 14:11 GMT

అవును.. టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉంటారు. ఆ మాటకు వస్తే బాలీవుడ్ తో పాటుదేశంలోని చాలా వుడ్ లు ఉన్నాయి. కానీ.. వీరిలో ఎవరికి లేని ఇమేజ్.. క్రేజ్ పవన్ సొంతం. ఒక వ్యక్తిని.. అతడి జీవనశైలిని ఒక ఇజంగా చూసి.. అభిమానించే పరిస్థితి మరే నటుడికి లేదనే చెప్పాలి. పవన్ లో ప్రత్యేకత ఏమంటే.. తన మనసులోనిది ఏదీ దాచుకోడు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు. నిజాయితీగా ఉంటాడు. ఎవరినైనా అభిమానిస్తాడేమో కానీ.. ఎవరిని అమితంగా ద్వేషించటం మాత్రం ఉండదు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడడు. అతడితో తనకున్న రాజకీయ వైరాన్ని.. కేవలం ఒక గుణంగా మాత్రమే చూస్తాడు తప్పించి.. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవటం కనిపించదు.

ఇదే విషయాన్ని తన మాటల్లో తరచూ ప్రస్తావిస్తుంటాడు. తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించి విడుదలైన ప్రోమోలో పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి. అవి పవన్ అభిమానుల్ని విపరీతంగా ఉర్రూతలూగిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరూ ఊహించని కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ లో తాను చెప్పిన డైలాగులు లాంటివి తనకు చెప్పటం ఇష్టం ఉండదని.. దర్శకుడు హరీశ్ శంకర్ బాధ పడలేక తాను ఆ డైలాగ్ చెప్పినట్లుగా పేర్కొన్నారు.

ఇంతకూ ఆ సీన్ ఏమంటే.. ఒక వ్యక్తి గాజు గ్లాస్ కిందకు పడేయటం.. అది కాస్తా ముక్కలైన వేళ ఎటకారంగా చెప్పే మాటకు అదిరే పంచ్ డైలాగ్ పవన్ నోటి నుంచి వస్తుంది. అందరికి ఆకట్టుకుంటున్న ఆ డైలాగ్ తనకు చెప్పటం ఇష్టం ఉండదని పవన్ వ్యాఖ్యానించారు. తన పొలిటికల్ పార్టీ మీటింగ్లో మాట్లాడిన పవన్.. ‘‘ఒక వ్యక్తి గాజు గ్లాస్ కింద పడేస్తాడు. అది ముక్కలవుతుంది. షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సీన్ ఎందుకు రాశావని హరీశ్ శంకర్ ను అడిగా. అందరూ మీరు ఓడిపోయారు అంటున్నారు. వాళ్లందరికీ నేను ఒక్కటే చెబుతున్నా. గాజుకు ఉన్న లక్షణం ఏమంటే.. పగిలేకొద్దీ పదునెక్కిద్ది. మీ నుంచి మేం ఇలాంటివి కోరుకుంటాం. మీరు తగ్గితే మాకు నచ్చదు’ అని హరీశ్ తనకు చెప్పినట్లుగా వెల్లడించారు.

నిజానికి తనుకు సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ చెప్పటం ఇష్టం లేదని.. హరీశ్ శంకర్ బాధ పడలేక ఆ డైలాగ్ చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి తీరే పవన్ ను మరింత అభిమానించేలా చేస్తుందని చెప్పాలి. హీరోయిజం ఎలివేట్ అయ్యే డైలాగ్ లను చెప్పటానికి ఉత్సాహం చూపే నటులకు భిన్నంగా నిలిచే పవన్ శైలి అందరిని ఆకట్టుకోవటమే కాదు ఆయన మీద అభిమానం మరింత ఎక్కువయ్యేలా చేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News