పవన్ డ్యాన్స్.. ఊగిపోయిన జనసైనికులు!
ఈ క్రమంలో పార్టీ అధినేత పవన్.. కార్యకర్తలను ఉత్సాహపరు స్తూ.. వాహనంపైనే కొన్ని స్టెప్పులు వేశారు. ఓ పాటకు ఆయన డ్యాన్స్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ తీసుకువచ్చారు. కాకినాడ పార్లమెంటు అభ్యర్థి.. జనసేన నాయ కుడు టీ-టైమ్ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పవన్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. ఈ సమయంలో వాహనంపై ఉన్న పవన్ కల్యాణ్, ఉదయ్ శ్రీనివాస్.. ఇతర పార్టీ నాయకులు.. యువతలో జోష్ పెంచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పార్టీ అధినేత పవన్.. కార్యకర్తలను ఉత్సాహపరు స్తూ.. వాహనంపైనే కొన్ని స్టెప్పులు వేశారు. ఓ పాటకు ఆయన డ్యాన్స్ చేశారు.
దీంతో జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడింది. అసలే జనసేన అధినేత అంటే.. ప్రాణాలు పెట్టే కార్యకర్తలు.. ఇక, ఆయన స్వయంగా డ్యాన్స్ చేస్తే.. ఊరుకుంటారా? వారు మరింత ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు. సుమారు 4 కిలోమీటర్లు సాగిన ఈ నామినేషన్ యాత్ర జోరుగా సాగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు.. అభిమానులు పాల్గొని.. పవన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు. వాస్తవానికి మంగళవారం నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్‌కు కూడా ఇంత జోష్ రాలేదనే చెప్పాలి. ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఇలా యుతను ఉత్సాహ పరచలేదు.
కానీ, టీ-టైమ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో మాత్రం చాలా జోరుగా, హుషారుగా పవన్ పాల్గొని డ్యాన్స్ చేయడం .. ఆసక్తిగా మారింది. ఇక, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు దాదాపు ఇప్పటికే నామినేషన్లు పూర్తి చేశారు. మిగిలిన ఒకరిద్దరు కూడా.. గురువారం నామినేషన్ వేయనున్నారు. వారి కార్యక్రమాలలోనూ పవన్ పాల్గొంటారని తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కూటమి పక్షాన 10 సభల్లో పాల్గొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.