పవన్ కేరాఫ్ పిఠాపురం...రీ సౌండ్ చేస్తారుట...!

అందుకే ఆయన తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురాన్నే కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యారు.

Update: 2024-03-25 17:41 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2019లో ఎందుకు ఓడానో ఆయన గుర్తించారు. గతంలో జరిగిన తప్పులను రిపీట్ చేయకూడదని తలచారు. అందుకే ఆయన తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురాన్నే కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యారు.

జగన్ కి పులివెందుల, చంద్రబాబుకు కుప్పం, లోకేష్ కి మంగళగిరి మాదిరిగా తనకు పిఠాపురం పోటీ చేసేందుకు సొంత నియోజకవర్గం కావాలని పవన్ తపిస్తున్నారు. దాని కోసం ఆయన పిఠాపురంలోనే అన్నీ అంతా అన్నట్లుగా తన కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ నెల 30 నుంచి పిఠాపురంలో పర్యటనలు చేయబోతున్నారు. వరసగా మూడు రోజుల పాటు ఆయన పిఠాపురం లోనే ఉంటారు. పిఠాపురం పర్యటనలో భాగంగా ఆయన ప్రజలతో పాటు వివిధ వర్గాల వారిని కలుసుకుంటారు అని తెలుస్తోంది.

అదే విధంగా మేధావులతో కూడా ఆయన చర్చాగోష్టిని నిర్వహిస్తారు అని అంటున్నారు. పిఠాపురంలో పవన్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకోవాలని భావిస్తున్నారు. పిఠాపురానికి ఏది అవసరం సమస్యలు ఏమిటి వాటికి పరిష్కారాలు ఏమిటి అన్నది కూడా జనసేన అధినేత పుర ప్రముఖులు విద్యావంతులు మేధావులు

ఇక పిఠాపురంలో శక్తిపీఠం ప్రసిద్ది. దాంతో పవన్ అక్కడకు వెళ్ళి శ్రీ పురుహూతిక అమ్మవారి దర్శనం చేసుకుంటారు అని అంటున్నారు. అలాగే దత్తపీఠాని ఆయన దర్శించుకుంటారు అని అంటున్నారు. ఇక ఏప్రిల్ 9న వచ్చే ఉగాది పండుగను కూడా ఆయన పిఠాపురంలొనే జరుపుకుంటారని అంటున్నారు.

పంచాంగ శ్రవణంతో పాటు తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఆయన ఉగాది రోజున అన్ని విషయాలు పండితులను అడిగి తెలుసుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు అని అంటున్నారు. పవన్ రానున్న నెలన్నర రోజులూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు అని అంటున్నారు.

ఈసారి పిఠాపురం నుంచి కేవలం గెలుపుని పవన్ కోరుకోవడం లేదు. కరవు తీరా బ్రహ్మాండమైన మెజారిటీని కోరుకుంటున్నారు అని అంటున్నారు. లక్ష ఓట్లకు తక్కువ కాకండా మెజారిటీ వచ్చేలా చూడాలని ఆయన పట్టుదలగా ఉంది.

అపరిమితమైన మెగా ఫ్యాన్స్ జనాభిమానం మెగా కుటుంబం సొంతం కానీ 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఒక సీట్లో ఓటమి పాలు అయి రెండవ సీటులో కేవలం అయిదు వేల మెజారిటీతోనే గెలిచారు.

ఆ తరువాత 2019లో ఆయన సోదరులు అయిన పవన్ నాగబాబు పోటీకి దిగితే ఓటమి పాలు అయ్యారు. దీంతో మెగా అభిమానం అంతా కేవలం సినిమాలకేనా రాజకీయాలకు కాదా అన్న చర్చకు తెర లేచింది. అది తప్పు అని నిరూపించేందుకు మెగాభిమానం పవర్ చూపించేందుకు జనసేన అధినేత పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అని అంటున్నారు. ఈసారి ఆయన గెలుపు రీ సౌండ్ చేయాలని కంకణం కట్టుకున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News