జగన్ విషయంలో పవన్ చెప్పాల్సింది చెప్పేసారా...?
జనసేన పార్టీ పెట్టింది పదేళ్ళ క్రితం. పాతికేళ్ళ ప్రస్థానం, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఇలాంటి స్టేట్మెంట్స్ చాలానే జనసేన అధినేత ఇచ్చారు
జనసేన పార్టీ పెట్టింది పదేళ్ళ క్రితం. పాతికేళ్ళ ప్రస్థానం, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఇలాంటి స్టేట్మెంట్స్ చాలానే జనసేన అధినేత ఇచ్చారు. అయితే గాజువాక సభలో మాత్రం ఆయన జనసేన టార్గెట్ ఏంటి అన్నది చెప్పాల్సింది చెప్పేశారు అని అంటున్నరు. తనకు సీఎం సీటు కంటే కూడా జగన్ సీఎం గా ఉండకూడదు అన్నదే పవన్ పంతం అన్నది ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది అని అంటున్నారు.
తాను వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిక వద్దు అని ఎందుకు అన్నాను అన్నది కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు. జగన్ సీఎం గా ఉండకూడదు అన్న దాని కోసమే తాను ఈ విధంగా పిలుపు ఇచ్చాను అని ఆయన చెప్పారు. ఇక సీఎం గా తాను కావడం అంటే కాలమే నిర్ణయిస్తుంది అని ఆయన అంటున్నారు. అదే సమయంలో జగన్ని ఎట్టి పరిస్థితుల్లో సీఎం గా ఉండనీయను అని గాజువాక సభలో పవన్ శపధమే చేశారు.
జగన్ సీఎం గా గట్టిగా ఉండేది ఆరు నెలల సమయమే సుమా అని చెబుతూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు. జస్ట్ ఆరు నెలలే. ఈ ఆరు నెలల సమయం మాత్రం అంతా భరించ తప్పదని కూడా పవన్ అంటున్నారు. గాజువాక కానీ దానికి ముందు జగదాంబా జంక్షన్లో జరిగిన సభ కానీ పవన్ జగన్నే టార్గెట్ చేస్తూ వచ్చారు. జగదాంబ సభలో ఫక్తు వ్యాపారి జగన్ అని విమర్శించిన పవన్ గాజువాకలో అయితే ఏకంగా క్రిమినల్ అంటూ విరుచుకుపడ్డారు.
కొండమీద క్రిమినల్స్ ఉండరాదు దేవుడు తప్ప అంటూ అని పవన్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. జగన్ని రుషికొండ మీద నివాసం ఉండనీయని అని అంటున్నారు జగన్ కి లక్ గా సీఎం పదవి దక్కిందని పవన్ అనడమూ విశేషం. నిజానికి జగన్ ఏకంగా పదేళ్ల పాటు జనంలో ఉంటూ పడిన కష్టానికే ఆ పదవి దక్కింది. అయితే జగన్ జనాలను మోసం చేసి పదవి అందుకున్నారని విమర్శించే పవన్ ఇపుడు ఆయనకు అదృష్టం అని అంటున్నారు.
ఆయన దేవుడు కాదు దెయ్యం అని పవన్ అంటున్నారు. మొత్తానికి గాజువాకలో పోటెత్తేలా జనాలు వస్తే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన అజెండా గురించి పెద్దగా చెప్పకుండా జగన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడడం విశేషం. తనకు సీఎం పదవి కంటే జగన్ ఆ సీఎం పదవి నుంచి దిగిపోవడమే ముఖ్యమన్నట్లుగా పవన్ మాట్లాడిన తరువాత పండుగ చేసుకోవాల్సిన పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీయే టీడీపీ.
ఏపీలో ఏ ప్రభుత్వం అయినా రానీయ్. జగన్ మాత్రం అధికారంలో ఉండకూడదు అని పవన్ ఒకటికి పదిసార్లు నిర్ధారించుకుని మాట్లాడుతున్నాక పొత్తులు చాలా సులువుగా కుదిరిపోతాయని టీడీపీ సంబరపడడంతో కూడా అర్ధం ఉంది అని అంటున్నారు.
మొత్తానికి పవన్ స్పీచ్ ప్రజలకు ఏ విధంగా నా అర్ధం అవుతుందో కానీ జనసైనికులు ఆయన్ని సీఎం కావాలని కోరుతున్నారు. ఆయన మాత్రం జగన్ సీఎం గా ఉండరాదు అన్న ఏకైక అజెండాతో ముందుకు వస్తున్నారు అని అంటున్నారు. గాజువాకలో సైతం అదే రకమైన రాజకీయ అయోమయంతో వైసీపీ వ్యతిరేక విధనానం అన్న ఏకైక క్లారిటీతో పవన్ మాట్లాడారు అని అంటున్నారు.