బాబు అరెస్ట్: పవన్ కల్యాణ్ సంపూర్ణ రియాక్షన్ ఇది!

ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.

Update: 2023-09-09 08:47 GMT

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తాజాగా సంచలనంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయలో ఇప్పటికే అరెస్టుపై టీడీపీ నేతలు, చంద్రబాబు అనుచరులు, అభిమానులు, బంధువులు, ఆత్మబంధువులు స్పందిస్తున్నారని తెలుస్తుంది! ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు.

అవును... ఉత్తరాంధ్రలో జరిగిన వారాహి యాత్ర అనంతరం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నట్లు కనిపించిన పవన్ కల్యాణ్... చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. చంద్రబాబు అరెస్టును జనసేన సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో సీనియర్ అయిన నాయకుడి పట్ల ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చారు.

ప్రాధమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తుందని ఆరోపించిన పవన్ కల్యాణ్... గత ఏడాది అక్టోబర్ లో విశాఖలో జనసేన కార్యకర్తల పట్ల కూడా ఏపీ పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందనేది అంతా చూశారని తెలిపారు. ఇదే సమయంలో ఏ తప్పూ చేయని జనసేన నాయకులను అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి జైల్లలో పెట్టారని తెలిపారు.

తాజాగా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు అరెస్టు సంఘటన కూడా అలాంటిదే అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఆయన అరెస్టును జనసేన సంపూర్ణంగా ఖండిస్తుందని పవన్ స్పష్టం చేశారు. ఫలితంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయమొలో తమ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వస్తారని, అది సహజం అని.. అలాంటి వారిని ఇల్లల్లోనుంచి బయటకు రాకుండా చేయడం ఏమిటని పవన్ ప్రశ్నించడం గమనార్హం! టీడీపీ నేతల హౌస్ అరెస్టులపై పవన్ రియాక్షన్ ఇది!

కాగా చంద్రబాబు అరెస్ట్ పై జనసేన మిత్రపక్షం బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ట్విట్టర్ వే దికగా స్పందించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును బీజేపీ ఖండిస్తుందని ఆమె తెలిపారు. ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.

గతకొన్ని రోజులుగా ఏపీలో సంచలనంగా మారిన చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారం పై పవన్ స్పందించని సంగతి తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో "ఏమై పోయావ్ బ్రో" అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా పలకరించే ప్రయత్నం చేశారు!

ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ ఒక వీడియోని విడుదల చేశారు. చంద్రబాబు అరెస్టును జనసేన సంపూర్ణంగా ఖండిస్తుందని వెల్లడించారు!

Tags:    

Similar News