టీడీపీకి మద్దతు మీద పవన్ సంచలన కామెంట్స్...!

తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాం అన్నది అనేక సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు

Update: 2023-12-20 16:48 GMT

తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాం అన్నది అనేక సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే మరోసారి ఆయన యువగళం ముగింపు సభ సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఆశించి అయితే తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం లేదు అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం వెనక రాష్ట్ర ప్రయోజనాలే ఉన్నాయని పవన్ మరోసారి నొక్కి చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి కచ్చితంగా ఏపీలో ఏర్పాటు అవుతుందని జగన్ని ఇంటికి పంపించి తీరుతామని పవన్ పేర్కొన్నారు. జగన్ ని జైలులో పెట్టించింది సోనియా గాంధీ అని పవన్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అయితే ఆ కోపాన్ని మాత్రం జగన్ చంద్రబాబు మీద తీర్చుకున్నారు అని పవన్ ఆరోపించారు. అది ఆయన అవివేకం అన్నారు. చంద్రబాబుని జైలులో పెడితే తనకు ఎంతో బాధ కలిగింది అని పవన్ చెప్పడం విశేషం. టీడీపీ కష్టాలలో ఉందని తాను సాయంగా ఉండాలని అనుకున్నాను అని పవన్ చెప్పుకొచ్చారు.

జగన్ ప్రభుత్వ పాలన మారాల్సిందే అని పవన్ మరోసారి బిగ్ సౌండ్ చేశారు. జగన్ ఏది మాట్లాడినా విపక్షాలను దూషిస్తారు అని తన పార్టీ వారితో విమర్శలు చేయిస్తారు అని పవన్ విమర్శించారు. దాడులు చేయించడం కూడా వైసీపీ నేతలకు అలవాటు అన్నారు. తాను వారాహి యాత్ర చేస్తున్నపుడు తన యాత్ర మీద కూడా దాడులు చేయించారు అని పవన్ అంటున్నారు.

ఇంట్లో తల్లికి చెల్లెలుకు విలువ ఇవ్వని వ్యక్తి ఆడపడుచులకు ఏమి గౌరవం ఇస్తారు అని పవన్ జగన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఒంటరి మహిళలు అన్యాయానికి గురు అవుతున్నారని పవన్ మళ్లీ ఆరొపైంచారు. ఈ విషయంలో న్యాయం జరగడం లేదు అని అన్నారు.

ఇక ప్రజాస్వామ్యం అంటే అర్ధం తెలియని వ్యక్త్రి జగన్ అని తీవ్ర వ్యాఖ్యలే పవన్ చేశారు. ఇదిలా ఉంటే జగన్ ఎమ్మెల్యేలను మార్చడం మీద కూడా పవన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలను మార్చడం కాదు ఏకంగా సీఎం ని మార్చడమే అని వైసీపీని ఓడించాలని జనాలకు పిలుపు ఇచ్చారు. ఏపీలో వచ్చేది నూరు శాతం టీడీపీ జనసేన ప్రభుత్వమని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

మొత్తానికి టీడీపీకి ఫుల్ సపోర్ట్ ని ఇస్తూ చంద్రబాబుని మెచ్చుకుంటూ పవన్ ప్రసంగం మొత్తం సాగింది. అదే విధంగా జగన్ ని ఘాటైన పదజాలంతో పవన్ విమర్శించడమూ జరిగింది. పవన్ స్పీచ్ అయితే యువగళం సభలో హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.

Tags:    

Similar News