కూటమి ప్రభుత్వంలో నంబర్ టూ ఆయనే ?

ప్రోటోకాల్ ప్రకారం సీఎం తరువాత పవన్ కే అని చెప్పాల్సి ఉంటుంది. అలా చూస్తే కనుక పవన్ నంబర్ టూ అవుతారు అని అంటున్నారు.

Update: 2024-06-19 15:35 GMT

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. దాదాపుగా మంత్రులు అందరూ చార్జి తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు ఉన్నారు. ఆయన తొమ్మిది సార్లు అసెంబ్లీకి గెలిచి వచ్చారు. ముమ్మారు సీఎం గా మరో ముమ్మారు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. దాదాపుగా అర్ధ శతాబ్దానికి చేరువలో ఆయన రాజకీయ జీవితం ఉంది.

దేశ రాజకీయాల్లో చూసిన బాబు సాటి సీనియర్ లీడర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎర్లీ సెవెంటీస్ లో రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పటికీ నాట్ ఔట్ అంటూ అప్టూ డేట్ గా ఉండడం అంటే అది బాబుకే సాధ్యం అని అంటున్నారు. చంద్రబాబు కూటమికి సారధ్యం వహించడమే ఒక ప్రత్యేకత. ఒక విధంగా ఆయన కేబినెట్ లో పనిచేయడం మంత్రులు అందరికీ అదృష్టం అని చెప్పాలి.

ఇక చంద్రబాబు తరువాత సీనియర్లు చూస్తే కేబినెట్ లో పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఆయన అయిదు సార్లు గెలిచి ఆర్ధిక శాసనసభ వ్యవహారాలను చూస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఆర్ధిక శాఖ అత్యంత ప్రధానం. అలా అనుకుంటే బాబు తరువాత నంబర్ టూ గా పయ్యావులనే చెప్పాల్సి ఉంటుంది. టాప్ ఫైవ్ పోర్టిఫోలియోలలో ఆర్ధిక శాఖ కూడా ఉంటుంది.

ఇక టీడీపీ కూటమిలో కీలకమైన మిత్ర పక్షంగా జనసేన ఉంది. ఆ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన అయిదు కీలకమైన శాఖలను చూస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం తరువాత పవన్ కే అని చెప్పాల్సి ఉంటుంది. అలా చూస్తే కనుక పవన్ నంబర్ టూ అవుతారు అని అంటున్నారు.

అదే విధంగా కీలక పోర్టుఫోలియో మరోటి ఉంది. అదే హోం శాఖ. ఆ శాఖను వంగలపూడి అనితకు ఇచ్చారు. సాధారణంగా సీఎం తరువాత ఎవరు అంటే వెంటనే హోం శాఖనే చూపిస్తారు. కేంద్రంలో మోడీ తరువాత ప్లేస్ లో అమిత్ షా ఉన్నారు. అంతకు ముందు కూడా వాజ్ పేయ్ ప్రధానిగా ఉంటే అద్వానీ హోం మంత్రిగా ఉన్నారు. ఉప ప్రధానిగా ఉన్నారు. అలా చూస్తే ఆమె కూడా నంబర్ టూ అనే చెప్పాల్సి ఉంటుంది.

ఇక నారా లోకేష్ కూడా ఐటీ మానవ వనరుల శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖతో ఉన్నారు. టీడీపీలో బాబు తరువాత పోస్ట్ చినబాబుదే. అలా ప్రభుత్వంలో కూడా సహజంగానే నంబర్ టూ చినబాబే అన్న మాట ఉంటుంది. కానీ ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి బాబు తరువాత చినబాబు ఉంటారా అన్నది ఒక చర్చ.

ఏది ఏమైనా రాజకీయంగా చెప్పాలంటే ఒకే ఒక్క మాట ఉంది. చంద్రబాబు తరువాత కూటమిలో నంబర్ టూ ఎవరూ అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని కూడా క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే పవన్ ప్రయారిటీ హై లెవెల్ లోనే ఉంటోంది. ఆయనను ప్రధాని మోడీ తుఫాన్ అని అభివర్ణించారు. చంద్రబాబు అయితే ఎంతో విలువ ఇస్తున్నారు. బాబు పవన్ జోడీయే కూటమి ప్రభుత్వం కాబట్టి బాబు తరువాత ఎవరు అంటే రెండవ మాట లేకుండా చెప్పాల్సిన పేరు పవన్ అని. ఎనీ డౌట్స్.

Tags:    

Similar News