ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ మాస్ వార్నింగ్ !

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి శాసనసభ స్థానం నుండి జనసేన తరపున సుందరపు విజయ్ కుమార్ శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు.

Update: 2024-07-16 06:00 GMT

''అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు. అప్పుడే ఫిర్యాదులు రావడం ఏంటి ? మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడే మీ పేరుతో దందాలు షురూ అయ్యాయి. రౌడీయిజం చేస్తే ఎట్టి పరిస్థితులలోనూ ఒప్పుకోను. అవసరం అయితే అటువంటి ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కూడా సిద్దం. ప్రజాస్వామ్య విధానాలు అపహస్యం చేసే ఎంతటి వారైనా వేటు తప్పదు'' అంటూ జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరికి మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఆయన జనసేన తరపున శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. ఆయన తరపున నియోజకవర్గంలోని పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేసి వాటాలు ఇవ్వాలని వత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఏకంగా కాంట్రాక్టర్లకు కూడా బెదిరింపులు వెళ్లాయట. దీంతో ఇలాగే వత్తిడి చేస్తే తమ యూనిట్లను మూయడం మినహా మరో దారి లేదని పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కార్యాలయాల దృష్టికి ఈ విషయాలు తీసుకువచ్చారట.

ఇంకో జనసేన శాసనసభ్యుడి నియోజకవర్గం లో  అక్కడి ఫార్మా పార్క్ లో వందలాది మంది పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.శాసనసభ్యుడి పేరుతో తమకు బెదిరింపులు వస్తున్నాయని వారు టీడీపీ, జనసేన అధిష్టానాలకు ఈ విషయాలను చేరవేశారు. దీంతో మంగళగిరిలో జనసేన ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో పవన్ వీరిద్దరినీ హెచ్చరించినట్లు సమాచారం. మీ వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా మసలుకోవాలని, కుటుంబ సభ్యులను ప్రభుత్వ వ్యవహారాలలో వేలు పెట్టకుండా చూసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది.


Full View


Tags:    

Similar News