టీడీపీకి నో చెప్పిన పవన్...ఎందుకలా...!?

అయిదు లక్షల మందితో ఈ భారీ బహిరంగ సభతోనే టీడీపీ ఎన్నికల యుధాన్ని స్టార్ట్ చేయనుంది అని అంటున్నారు.

Update: 2023-12-16 09:54 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి నో చెప్పారు. ఫస్ట్ టైం అలా చెప్పారనుకోవాలి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 20న విజయనగరం జిల్లాలోని పోలిపల్లిలో భారీ ఎత్తున టీడీపీ సభను నిర్వహిస్తోంది. ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి జనాలను తీసుకుని వచ్చేందుకు ఏకంగా ఆరు రైళ్ళను వేశారు.

అయిదు లక్షల మందితో ఈ భారీ బహిరంగ సభతోనే టీడీపీ ఎన్నికల యుధాన్ని స్టార్ట్ చేయనుంది అని అంటున్నారు. ఈ సభలో ఫస్ట్ టైం చంద్రబాబు పవన్ బహిరంగంగా కనిపిస్తారని అంతా అనుకున్నారు. ఆ విధంగా అటు టీడీపీకి ఒక్కసారిగా జోష్ పెంచాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. దానికి ఇపుడు బ్రేక్ పడుతోంది అని అంటున్నారు.

ఈ నెల 20న జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సమావేశానికి తాను హాజరుకాబోవడం లేదని పవన్ కళ్యాణ్ సున్నితంగానే టీడీపీ నేతలకు చెప్పారని అంటున్నారు. ఆ రోజున తనకు వేరే పనులు ఉన్నాయని షెడ్యూల్ ప్రొగ్రాం కూడా ఉందని పవన్ చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అందువల్ల తాను రాలేనని పవన్ చెప్పేసారు అంటున్నారు.

అయితే టీడీపీ జనసేన ఉమ్మడి మ్యానిఫేస్టో రిలీజ్ సభకు తాను హాజరవుతాను అని పవన్ మరో మాట చెప్పారట. అలా టీడీపీకి ఊరటను ఇచ్చే ప్రయత్నం చేసారని టాక్. అంతే కాదు టీడీపీ జనసేన భవిష్యత్తులో నిర్వహించే మరిన్ని సభలకు కూడా తాను అటెండ్ అవుతాను అని పవన్ చెప్పారని తెలుసోంది.

మొత్తానికి చూస్తే మాత్రం యువగళం ముగింపు సభకు మాత్రం నో అని పవన్ చెప్పేశారు అన్నదే ఇపుడు హాట్ టాపిక్. ఈ సభకు పవన్ ప్రధాన ఆకర్షణ అని అంటున్నారు. పవన్ కనుక వస్తే సభ ఒక రేంజిలో సక్సెస్ అవుతుందని టీడీపీ వ్యూహరచన చేసింది అని అంటున్నారు.

అంతే కాదు టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ కూడా హైలెట్ అయి యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంటారు అని కూడా అంచనా వేశారు. కనీ పవన్ నో చెప్పడంతో టీడీపీ శ్రేణులు పూర్తి నిరుత్సాహానికి గురి అవుతున్నాయని అంటున్నారు ఒక చంద్రబాబు స్పీచ్ అన్నది తెలిసిందే. అదే విధంగా నారా లోకేష్ స్పీచ్ యువగళం పేరిట రోజూ జరుగుతూనే ఉంది. మరి కొత్తగా ఈ ఇద్దరూ మాట్లాడే ప్రయత్నం చేస్తేనే వచ్చిన జనానికి పూర్తి స్థాయిలో జోష్ వస్తుంది.

ఇంతకీ పవన్ ఎందుకు రాను అని చెప్పారు అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. పవన్ రాకపోవడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా లేక జనసేన వేరే వ్యూహాలతో అలా నో చెప్పిందా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. అయితే సీట్ల విషయం ఎటూ టీడీపీ తేల్చకపోవడంతో జనసేనలో ఒకింత అసహనం వ్యక్తం అవుతోంది అని అంటున్నారు

అంతే కాదు యువగళం ముగింపు అటే నారా లోకేష్ ని హైలెట్ చేసే సభ. పవన్ జనసేన పార్టీ సారధిగా ఉన్నారు. ఆయన పార్టీ ఉండగా వేరే పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు కానీ అక్కడ వారసులను పైకి లేపాల్సిన అవసరం అయితే లేదనే అంటున్నారు. మొత్తానికి చూస్తే సంథింగ్ ఏమైనా ఈ రెండు పార్టీలలో జరుగుతోందా అన్నది అయితే చర్చగా ఉంది.

Tags:    

Similar News