వైసీపీ గెలుస్తుందనే టీడీపీతో పొత్తు అంటున్న పవన్

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఉద్దేశ్యంతోనే టీడీపీతో కలిశామని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో త్రిముఖ పోటీ జరిగితే మాత్రం కచ్చితంగా వైసెపీయే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.

Update: 2023-11-25 03:00 GMT

ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకూడదు అన్న ఏకైక పొలిటికల్ అజెండాతోనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లుగా పవన్ స్పష్టం చేశారు. విశాఖలో శుక్రవారం పవన్ నిర్వహించిన పర్యటనలో వైసీపీ మీద నిప్పులే చెరిగారు. ఇది రూపాయి పావలా ప్రభుత్వం అని దుయ్యబెట్టారు.

పాతిక లక్షల విలువ చేసే ఒక్కో బోటుకు పూర్తి నష్ట పరిహారం చెల్లించాలని అడిగితే 15 లక్షలు ఇస్తామని చెప్పి చివరికి ఏడు లక్షలు మాత్రమే ఇచ్చారంటేనే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది అని పవన్ ఫైర్ అయ్యారు. మత్య్సకారుల ప్రయోజానాలు కాపాడడంతో ప్రభుత్వం విఫలం అయిందని ఆయన విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఉద్దేశ్యంతోనే టీడీపీతో కలిశామని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో త్రిముఖ పోటీ జరిగితే మాత్రం కచ్చితంగా వైసెపీయే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. అపుడు మళ్లీ ఇలాగే ఉంటుందని బోట్లు తగలబడినా పట్టించుకునే వారే ఉండరని పవన్ అన్నారు.

దండుపాలెం బ్యాచ్ లా వైసీపీ తయారైందని తనకు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఈసారి జనసేన ఓటమి పాలు కాకూడదని, ఎక్కడా అయిదు వందల ఓట్లతో ఓటమి చెందామని లేక అయిదు వేల ఓట్లతో ఓడామన్న మాట రాకూడదని పవన్ గట్టిగా క్యాడర్ కి చెప్పారు. ఈసారి పాతిక నుంచి యాభై వేల భారీ మెజారిటీలు జనసేన అభ్యర్థులకు దక్కాలని ఆయన కోరుకున్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెరైన్ పోలీసింగ్ ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పటిష్టమైన భద్రత కలిగిన ఫిషింగ్ హార్బర్ ని నిర్మిస్తామని కూడా పవన్ చెప్పారు. జగన్ కి ఉన్న ఇళ్ళు చాలక విశాఖలోని రుషికొండ మీద భారీ ఖర్చుతో మరో పాలెస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ సొమ్ము కనుక ఇటు వైపు ఇస్తే ఫిషింగ్ హార్బర్ మరోటి అద్భుతంగా తయారు అయ్యేదని పవన్ అంటున్నారు.

తాను ఏపీకి ఎపుడు వస్తాను అని అన్నా ఏపీ ప్రభుత్వం ఆటంకాలు పెడుతోందని ఆయన మండిపడ్డారు. రోడ్డు మార్గం ద్వారా వద్దామంటే సరిహద్దుల వద్ద ఆపు చేస్తారని, విమానంలో వద్దామంటే భద్రతా కారణాలు చెబుతారని ఈ రోజు కూడా అధికారులు కొందరు అదే చేశారని అందుకే తన రాక ఆలస్యం అయిందని పవన్ అన్నారు.

జనసేనను చూసి వైసీపీ భయపడుతోంది అనడానికి ఇదే నిదర్శనం అని ఆయన అన్నారు. ఇదిలా అంటే విశాఖ విమానాశ్రయాన్ని ప్రతీ రోజూ రాత్రి ఎనిమిది దాటిన తరువాత మూసేస్తున్నారు. అక్కడ రన్ వే మీద పనులు చేపడుతున్న కారణంగా ఆరు నెలల పాటు ఇలా రాత్రి వేళల్లో కుదింపు ఉంది. దాంతో పవన్ విశాఖలోనే శుక్రవారం రాత్రి ఉండిపోయారు. మొత్తానికి పవన్ వైసీపీ మీద హాట్ కామెంట్స్ తో విశాఖలో పొలిటికల్ వేడిని పెంచేశారు.

Tags:    

Similar News