రింగ్ తో కింగ్ : పవన్ ఉంగరాల స్టొరీ ఇంటెరెస్టింగ్ !
కింగ్ కావాలంటే ఏమి చేయాలి. చాలానే చేయాలి. అయినా దక్కకపోతే అపుడు రింగ్స్ వాడాలి. అలా జ్యోతీష్య పండితులు చెబుతూ ఉంటారు. నమ్మకం ఉన్న వారు పాటిస్తారు.
కింగ్ కావాలంటే ఏమి చేయాలి. చాలానే చేయాలి. అయినా దక్కకపోతే అపుడు రింగ్స్ వాడాలి. అలా జ్యోతీష్య పండితులు చెబుతూ ఉంటారు. నమ్మకం ఉన్న వారు పాటిస్తారు. సెంటిమెంట్స్ లేని వారు బహు తక్కువ. ఇక సినీ రాజకీయ ప్రముఖులకు అవి మరీ ఎక్కువ
ఇదిలా ఉంటే ఏపీలో 2024 ఎన్నికలు చాలా మందికి కలర్స్ లో కనిపిస్తున్నాయి. కలలలో తేలుస్తున్నాయి. థర్టీ ఇయర్స్ సీఎం తానే అనుకుంటూ వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో మరోసారి గట్టిగానే కొట్టాలని చూస్తున్నారు. ఇంకో వైపు చూస్తే చంద్రబాబు నాలుగవ సారి తాను సీఎం సీటు ఎక్కుతాను అంటున్నారు.
ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో జనసేన విషయం కూడా చెప్పుకోవాలి. 2019 లో ఒంటరిగా పొటీ చేసి తాను కంటెస్ట్ చేసిన రెండు సీట్లలో సైతం ఓడిన పవన్ 2024లో ఏకంగా కింగ్ కావలని అనుకుంటున్నారు. అది అత్యాశ అని ఎవరికైనా అనిపించవచ్చు.
కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. సరిగ్గా గురి పెట్టి కొట్టాలి అదే టైం లో లక్ అతని వైపు చూస్తూండాలి. ఈ రెండు జరిగితే కుర్చీ అలా దగ్గరకే వస్తుంది. ఇపుడు పవన్ కూడా వై నాట్ సీఎం సీటు అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ దూకుడు చేస్తూ పోతోంది.
టీడీపీ ఆ ధాటికి విలవిలలాడుతోంది. ఆ పార్టీ గతంలోలా లేదు అంటున్నారు. ఇక జగన్ దూకుడు కొందరికి నచ్చచు అని అంటున్నారు. ఈ చాన్స్ ఎందుకు మిస్ చేసుకోవడం అన్నట్లుగా పవన్ ఫీల్డ్ లో జోరు చేస్తున్నారు. అందుకే ఆయన బాబు అరెస్ట్ అయిన వెంటనే తన అజెండాను స్పీడ్ గానే ప్రకటించేశారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు తో ములాఖత్ అయి బయటకి వచ్చి మీడియాతో మాట్లాడిన పవన్ చేతికి రెండు బంగారు ఉంగరాలు ధగధగా మెరవడం అంతా చూసారు. ఆ బంగారు ఉంగరాలు ముచ్చట గొలుపుతున్నాయి. ముద్దుగా బొద్దుగా ఉన్నాయి. అంత పెద్ద ఉంగరాలు పవన్ ధరించడం అది కూడా కుడి చేతికి ధరించడం ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు.
సాధారణంగా ఆడంబరాలకు పవన్ దూరంగా ఉంటారు. అలాంటి పవన్ చేతికి అతి పెద్ద బంగారు ఉంగరాలు అంటే మ్యాటర్ చాలానే ఉంది అంటున్నారు. ఆ బంగారు ఉంగరాలలో ఒకటి తాబేలు ఆకారంలోకి ఉంగరం. రెండవది నాగ అంగుళీకం. ఈ రెండు ఉంగరాలు ధరించడం వల్ల లాభమేంటి అంటే రాజయోగమే అంటున్నారు పండితులు.
జాతకం మారిపోతుందిట. అధికారం దక్కుతుందిట. అలాగే సంపద దరి చేరుతుందిట. శత్రు భయం లేకుండా ఉంటుందిట. దుష్ట శక్తులు ఆ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా జంకుతారట. అయితే వీటిని ఎవరి పడితే వారు ధరించకూడదు. కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే వీటిని ధరిస్తే ఫలితం ఉంటుంది.
అలా పవన్ కి జ్యోతీష్య పండితులు చెప్పి ఉండవచ్చునని అందుకే ఆయన ఈ బంగారు ఉంగరాలు ధరిస్తున్నరు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం కావాల్సిందే అని పవన్ స్కెచ్ వేస్తున్నారు అని ప్రచారం అయితే ఉంది. టీడీపీ వీక్ అయిన చోట మిత్రపక్షంగా జనసేన దూకుడు స్టార్ట్ చేసేసింది. రేపటి రోజున ఆ స్పీడ్ తోనే పవన్ సీఎం సీటు ని షేరింగ్ గా అడిగినా అడుగుతారు. దానికి బాబు ఒప్పుకుంటారంతే అంటున్నారు. కారణం బంగారు ఉంగరాల మహిమ అంటున్నారు.
మొత్తానికి పవన్ చాలా పట్టుదలగా పీఠం వైపుగా చూస్తున్నారు. వదిలేది లేదు 2024 ఎన్నికలు అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు. మరి తాబేలు ఉంగరం, నాగ అంగుళీకం ఆయన రాజకీయ దిశ దశను మార్చేస్తాయా అంటే వెయిట్ అండ్ సీ.