పవన్ అక్కడ నుంచే పోటీ.. భారీ మెజారిటీ ఖాయమట...!
మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటు డిసైడ్ అయింది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారు అని తెలుస్తోంది.
మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటు డిసైడ్ అయింది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారు అని తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వంతో కూడా చెప్పేసినట్లు చెబుతున్నారు. భీమవరం నుంచి పవన్ పోటీకి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే పవన్ ఎందుకు భీమవరం ఎంచుకుంటున్నారు అంటే 2019లో అక్కడ నుంచి పవన్ పోటీ చేసి ఓడారు. అది కూడా కేవలం ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పవన్ కి 62 వేల 285 ఓట్లు వచ్చాయి. వైసీపీ తరఫున పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ కి 70, 642 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ పడిన పులపర్తి రామాంజనేయులుకు 54 వేల దాకా ఓట్లు వచ్చాయి.
ఇక ఇపుడు చూస్తే టీడీపీ జనసేన పొత్తులలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే లక్షా పదహారు వేల పై చిలుకు ఓట్లు అవుతాయని అంటున్నారు. ఇక వైసీపీకి గతంలో మాదిరిగా డెబ్బై వేల ఓట్లు వచ్చినా కూడా దాదాపుగా నలభై వేల ఓట్ల భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఈజీగా గెలుస్తారు అని అంటున్నారు.
ఇక పవన్ కేవలం ఒక ఎన్నిక కోసమే భీమవరాన్ని ఎంపిక చేసుకోవడం లేదు, ఇక మీదట తన సొంత నియోజకవర్గంగా చేసుకోవడానికే ఈ సీటు మీద మోజు పడుతున్నారు అని అంటున్నారు. పవన్ సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో ఈ నియోజకవర్గం ఉండడం ఆయన సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఇక మీదట చంద్రబాబుకు కుప్పంలా జగన్ కి పులివెందుల మాదిరిగా తనకూ కేరాఫ్ అడ్రస్ గా భీమవరం ఉండాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు అని అంటున్నారు.
ఇక పవన్ భీమవరం నుంచి పోటీకి ముందు మరో మూడు సీట్లను కూడా తీవ్రంగా పరిశీలించారని అంటున్నారు. అవి తిరుపతి, అనంతపురం అర్బన్, పిఠాపురం అని అంటున్నారు. ఇందులో తిరుపతి చిరంజీవి గెలిచిన సీటు. అనంతపురం అర్బన్ లో బలిజలు ఎక్కువగా ఉంటారు. పిఠాపురంలో కూడా జనసేనకు 2019లో ముప్పయి వేల దాకా ఓట్లు వచ్చాయి.
అయితే భీమవరం నుంచి పోటీ చేస్తే టీడీపీ నుంచి పెద్దగా పోటీ లేదు, ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పులపర్తి రామాంజనేయులుకు చంద్రబాబు హామీ ఇస్తారని అంటున్నారు. దాంతో అంతా కలసి మనస్పూర్తిగా పవన్ని గెలిపిస్తారు అని అంటున్నారు. ఇక ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఏపీ వ్యాప్తంగా జనసేన టీడీపీ కూటమిని ప్రచారం చేయవచ్చునని గెలుపు మాత్రమే కాదు భారీ మెజారిటీకి కూడా చూసుకోవాల్సిన పని లేదు అని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు.
మరో విషయం ఏంటి అంటే ఈసారి పవన్ సింగిల్ సీటు మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఆయన ఒకే ఒక సీటు నుంచి పోటీ అదే భీమవరం అని అంటున్నారు. దాంతో ప్రజలు కచ్చితంగా ఆయన్ని గెలిపిస్తారు అని విశ్వసిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తారా లేక ఆ పార్టీ వేరే వారిని మారుస్తుందా అన్నది చూడాలి మొత్తానికి పవన్ కి భీమవరం వరం ఇస్తుంది అని జనసైనిక్స్ ఫుల్ హుషార్ చేస్తున్నారు.