పవన్ తెనాలి పర్యటన వాయిదా.. ఫ్యాన్స్ కోరిక ఇదే!
బహిరంగ సభలో పాల్గొన్నారు! ఇదే సమయంలో ఆటోల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మమేకమయ్యారు.
పవన్ కల్యాణ్ వరుసగా నాలుగు రోజులపాటు తాను పోటీచేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన పవన్... దర్గాను సందర్శించారు! ఇదే క్రమంలో అభిమానూలతోనూ, కార్యకర్తలతోనూ భేటీ అయ్యారు. బహిరంగ సభలో పాల్గొన్నారు! ఇదే సమయంలో ఆటోల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మమేకమయ్యారు.
ఈ క్రమంలో తాను పోటీచేయబోయే నియోజకవర్గం పిఠాపురంలో పర్యటన ముగించుకుని.. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ పోటీ చేసే స్థానం తెనాలిలో పవన్ పర్యటన ఉంటుందని తెలిపారు! ఈ సమయంలో తెనాలిలో పవన్ పర్యటన ఉంటుందని ఎదురుచూసిన జనసైనికులకు తాజాగా బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారని జనసేన రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు.
పవన్ కు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని.. ఈ క్రమంలో కనీసం 2 - 3 రోజుల విశ్రాంతి అవసరం అని చెప్పారని వెల్లడించారు. దీంతో... తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభ రద్దయ్యాయి! ఇదే క్రమంలో... రీ షెడ్యూల్ చేసిన పర్యటన వివరాలను త్వరలో ప్రకటిస్తామని హరిప్రసాద్ వెల్లడించారు. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.
అవును... రాజకీయ పర్యటనలు, బహిరంగ సభ్యలు నిర్వహించిన అనంతరం పవన్ రెగ్యులర్ గా అనారోగ్యం బారిన పడుతున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కష్టాలను తెలుసుకొనేందుకు ప్రతి ఆదివారం జనవాణి - జనసేన భరోసా పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం సమయంలోనూ పవన్ అనారోగ్యం బారిన పడటం.. దీంతో నాడు ఆ ప్రొగ్రాం వాయిదా పడటం తెలిసిందే.
ఇదే క్రమంలో... వెస్ట్ గోదావరిలోని వారాహి యాత్ర సమయంలోనూ పవన్ అనారోగ్యం బారిన పడ్డారు. అయితే... ఆ సమయంలో "బ్రో" సినిమాకి భీమవరంలోనే డబ్బింగ్ చెప్పినట్లు వార్తలు, కొన్ని ఫోటోలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా పిఠాపురం పర్యటన ముగియగానే ఆయన తీవ్ర జ్వరం బారిన పడటంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో... ఆయన ఆరోగ్యం త్వరగా కుదిటిపడాలని.. ఆయనకు ఎలక్షన్ అయ్యేవరకూ ఎలాంటి అనారోగ్యం కలగకూడదని జనసైనికులు కోరుకుటున్నారు! అదేవిధంగా... మార్షల్ ఆర్ట్ లో నైపుణ్యం కలిగి, ఎంతో ఫిట్ గా ఉన్నట్లు కనిపించే పవన్ కు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని ఆలోచిస్తున్నారంట.
ఇదే సమయంలో... 73 ఏళ్ల వయసులో పలు అనారోగ్య సమస్యలు ఉన్న, ఇటీవలే కంటికి సర్జరీ కూడా చేయించుకున్న చంద్రబాబు... ఎండా కొండా లేకుండా అవిరామంగా బహిరంగ సభల్లో పాల్గొంటూ.. ఉత్సాహంగా కదులుతున్న సమయంలో.. 52 ఏళ్ల పవన్ మాత్రం ఇలా దాదాపు ప్రతీ పర్యటన అనంతరం అనారోగ్యం బారిన పడుతుండటం జనసైనికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుందంట!