పవన్ వారాహీ యాత్రకు టీడీపీ ఫుల్ సపోర్ట్!

దాంతో పవన్ యాత్రకు టీడీపీ ఫుల్ సపోర్ట్ అంటే కచ్చితంగా అది జనసేన యాత్రను సూపర్ హిట్ చేస్తుందని అంటున్నారు

Update: 2023-09-29 10:26 GMT

జనసేన టీడీపీ పొత్తు అంకం గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్ళే ఒక కీలక ఘట్టానికి తెర లేవనుంది. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో అక్టోబర్ 1 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహీ యాత్రకు టీడీపీ క్యాడర్ పూర్తి మద్దతు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ యాక్టివిటీ ఇపుడు కొంత తగ్గింది. చంద్రబాబు జిల్లా టూర్లు లేవు ఆయన అరెస్ట్ అయి జైలులో ఉన్నారు కాబట్టి.

ఇక ఈ నెల 14న ఢిల్లీ వెళ్ళిన లోకేష్ బాబు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఆయన 29 నుంచి ఏపీలో తిరిగి జరప తలపెట్టిన యువగళం పాదయాత్రకి మరోసారి బ్రేకులు పడ్డాయి. దాంతో టీడీపీ శ్రేణులు పూర్తి అయోమయంలో ఉన్నాయి. దాంతో టీడీపీ శ్రేణులను రీ చార్జి చేయడానికి వైసీపీ సర్కార్ మీద స్ట్రాంగ్ వాయిస్ వినిపించడానికి పవన్ వారాహి యాత్రను వాడుకోవాలని టీడీపీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఈ మేరకు ఢిల్లీ నుంచి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కి గురువారం సాయంత్రం ఫోన్ చేసి రెండు పార్టీలు ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించినట్లుగా తెలిసింది. వారాహి యాత్ర నుంచే టీడీపీ జనసేన ఒక్కటిగా కనిపించే ప్రయత్నం చేయడం మీద కూడా చర్చించారు అని అంటున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లా టీడీపీకి కంచు కోట లాంటిది. అలాంటి చోట పవన్ వారాహి యాత్ర చేస్తున్నారు.

దాంతో పవన్ యాత్రకు టీడీపీ ఫుల్ సపోర్ట్ అంటే కచ్చితంగా అది జనసేన యాత్రను సూపర్ హిట్ చేస్తుందని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు మంగళగిరిలోని జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ కూడా ఆమోదించింది అని అంటున్నారు. దాంతో చూస్తే కనుక అక్టోబర్ 1 నుంచి పవన్ వారాహి యాత్ర ఈసార్ వెరీ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు.

పవన్ యాత్ర అనగానే ఎపుడూ ఆయన బొమ్మలు, ఆయన బొమ్మలతో టీ షర్టులు వేసుకున్న యూత్, జనసేన జెండాలు వంటినే కనిపిస్తాయి. కానీ ఈసారి వాటితో పాటుగా పసుపుదనం ఫుల్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ జై అనే ఆయన ఫ్యాన్స్ జనసైనికులతో పాటుగా చంద్రబాబుకు జై అంటూ సౌండ్ చేసే టీడీపీ తమ్ముళ్ళు కూడా అక్కడ పసుపు జెండాలతో దర్శనం ఇస్తారని అంటున్నారు.

ఒక విధంగా నిస్తేజంతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీ తమ్ముళ్ళకు పవన్ వారాహీ యాత్ర ఒక బూస్టింగ్ గా పనిచేస్తుంది అని అంటున్నారు. అదే విద్ధంగా చూసుకుంటే జనసేన టీడీపీ కలిస్తే ఆ ఊపు హుషార్ ఏ రేంజిలో ఉంటాయన్నది ఏపీ రాజకీయానికి జనాలకు కూడా తెలియచేడయం ద్వారా వైసీపీకి తాము స్ట్రాంగ్ అల్టర్నేషన్ అన్న సంకేతాలు పంపేందుకు వీలు అవుతుంది అని అంటున్నారు.

అందుకే లోకేష్ ప్రతిపాదనకు పవన్ ఆమోదించారని తెలుస్తోంది. ఇక అక్టోబర్ మొదటి వారంలో చూసుకుంటే జాయింట్ యాక్షన్ కమిటీ ప్లాన్ ని కూడా అటు జనసేన ఇటు టీడీపీ ఆమోదిస్తారని తెల్సుతోంది. ఆ విధంగా వారాహి యాత్ర తోనే ఈ పొత్తుకు శుభారంభం పలుకుతారు అని అంటున్నారు. చూడాలి మరి అక్టోబర్ ఒకటవ తేదీన బందర్ రోడ్డులో రాజకీయ సందడి ఏ విధంగా ఉండబోతోందో.

Tags:    

Similar News