కూట‌మికి భ‌లే ల‌క్కీ ఛాన్స్ ఇది... !

అయితే.. వ‌చ్చే రోజుల్లోనూ ఇలాంటి ప‌రిస్థితి ఉంటుందా? 2029 నాటికి కూడా.. త్యాగాలు చేయాల్సి ఉంటుందా? అంటే.. అలా లేదు.

Update: 2024-07-19 13:30 GMT

ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వంలో కొంద‌రు నాయ‌కుల‌కు అవ‌కాశం చిక్క‌లేదు. మ‌రికొంద‌రు సీనియ‌ర్లే అయినా.. పోటీ చేసేందుకు టికెట్ల స‌మ‌స్య కూడా వ‌చ్చింది. దీంతో చంద్ర‌బాబు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ.. అంద‌రినీ మెప్పించి.. ఆయ‌న రాజ‌కీయంగా జ‌గ‌న్ పై పైచేయి సాధిం చారు. అయితే.. వ‌చ్చే రోజుల్లోనూ ఇలాంటి ప‌రిస్థితి ఉంటుందా? 2029 నాటికి కూడా.. త్యాగాలు చేయాల్సి ఉంటుందా? అంటే.. అలా లేదు.

ఎందుకంటే.. రాష్ట్రంలో విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కార‌మే కాకుండా.. కేంద్రం ప్ర‌తి 15-20 ఒక‌సారి చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న ప్ర‌కారం.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాలు పెర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. ఇవి.. జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. పెర‌గ‌నున్నాయి. అసెంబ్లీకి మ‌రో 50 మంది నాయ‌కుల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా పార్ల‌మెంటుకు మ‌రో 5 స్థానాల వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నాయ‌కుల‌కు చేతి నిండా సీట్లు ల‌భిస్తాయి. అయితే.. ఈ ప‌రిణామం.. టీడీపీకి క‌లిసి వ‌స్తున్నా.. అదే జరిగితే.. జనసేన పార్టీకి అభ్యర్థుల కొరత ఉంటుంది. నిజానికి ఇప్పటికీ జనసేన పార్టీకి పెద్దగా నేతలు లేరు. అందుకే గత ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ నేతల్ని చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అవకాశాల్ని ముందుగా అందిపుచ్చుకోవడానికి చాలా మంది రెడీ అవుతున్నారు.

ఇక‌, బీజేపీ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. బీజేపీకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఎవ‌రున్నా రంటే.. ప‌ట్టుమ‌ని 20 మంది లోపే ఉన్నారు. వీరిలోనూ గెలుపు గుర్రం ఎక్కేవారు 50 శాతం మంది మాత్ర మే ఉన్నారు. ఇప్పుడంటే.. జ‌గ‌న్ వ్య‌తిరేక ప‌వ‌నాల్లో గెలిచేసినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పెర‌గ‌నున్న సీట్లు , ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త వంటివి లెక్క‌లు వేసుకుంటే.. బీజేపీకి కూడా బ‌ల‌మైన నాయ‌క‌త్వం కావాల్సి ఉంటుంది. కాబ‌ట్టి.. వ‌చ్చే నాలుగేళ్ల‌లో అయినా.. నాయ‌కుల‌ను పెంచుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News