ఏకంగా ఎస్సైనే బెదిరించి ఎత్తుకెళ్లారు !

యాకుత్‌పుర స్టేషన్‌లో నలుగురు దుండగులు రైలు ఎక్కి ఎస్సై ప్రసాద్‌ను చాకుతో బెదిరించి, దాడి చేసి ఆయన వద్ద ఉన్న 2.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.700 నగదు, 2 సెల్‌ఫోన్లను తీసుకొని ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌లో దిగి పారిపోయారు.

Update: 2024-04-28 08:30 GMT

హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ రైలులో ప్రయాణిస్తున్న ఎస్సైనే గుర్తుతెలియని వ్యక్తులు చాకుతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లను తస్కరించిన ఘటన కలకలం రేపుతున్నది.

మైలార్‌దేవ్‌పల్లి, దుర్గానిలయం, ప్రగతినగర్‌ కాలనీకి చెందిన నారాయణ కుమారుడు డి.ప్రసాద్‌ (55) డార్జిలింగ్‌ పట్టణంలో సీఆర్‌పీఎఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు.

ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌- ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కాడు. యాకుత్‌పుర స్టేషన్‌లో నలుగురు దుండగులు రైలు ఎక్కి ఎస్సై ప్రసాద్‌ను చాకుతో బెదిరించి, దాడి చేసి ఆయన వద్ద ఉన్న 2.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.700 నగదు, 2 సెల్‌ఫోన్లను తీసుకొని ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌లో దిగి పారిపోయారు. సామాన్యులకు అన్యాయం జరిగితే పోలీసుల దగ్గరకు వెళ్తారు. మరి ఏకంగా ఎస్సైకే అందులోనూ హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరంలో ఈ పరిస్థితి ఎదురయితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న చర్చ తలెత్తుతున్నది.

విక్రమార్కుడు సినిమాలో ఇంట్లోకి లక్ష్మితల్లి వస్తుంది. పాతమొక్కులు ఉన్నాయి గుండు కొట్టించుకుంటే ధనలక్ష్మి తలుపులు బద్దలు కొట్టుకుని వస్తుందని అందరికీ రవితేజ అరగుండు కొడితే తర్వాత బ్రహ్మానందం అందిరికీ మిగిలిన గుండ్లు కొడతాడు. అందరూ కలిసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మొరపెట్టుకుంటే ఎమ్మెల్యే సతీమణి తన గుండు చూయిస్తుంది. ఎస్సైని దోచుకున్న ఘటన చూస్తే అవే సన్నివేశాలు గుర్తుకు రాక తప్పవు.

Tags:    

Similar News