ఖరీదైన ఐఫోన్లు లేపేసారు.. వాటి ధర ఎంతంటే?

సెల్ ఫోన్ మార్కెట్లో ఐఫోన్లకు ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. ఆ ఫోన్‌ను వాడడాన్ని కొందరు పలుకుబడిలా తీసుకుంటూ ఉంటారు.

Update: 2024-09-02 12:56 GMT

సెల్ ఫోన్ మార్కెట్లో ఐఫోన్లకు ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. ఆ ఫోన్‌ను వాడడాన్ని కొందరు పలుకుబడిలా తీసుకుంటూ ఉంటారు. ఒక్క ఫోన్ విలువ సుమారు రూ.70 వేల పైనే. అందుకేనేమో దుండగులు ఐ ఫోన్లకు టెండర్ వేసేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1500 ఐ ఫోన్లు కొట్టేశారు. కంటైనర్ నుంచి ఈజీగా లేపేసారు. ఆగస్టు 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఓ కంటెయినర్ ట్రక్కు హర్యానా నుంచి చెన్నై వెళ్తోంది. గురుగ్రామ్ నుంచి బయలుదేరిన ట్రక్కు మధ్యప్రదేశ్‌లోకి రాగానే కొందరు దుండగులు దానిపై దాడికి పాల్పడ్డారు. డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చి.. బంధించారు. ఆ తరువాత ట్రక్కులోని ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఆ తరువాత స్పృహలోకి వచ్చిన డ్రైవర్ ఫోన్లు ఎత్తుకెళ్లిన విషయాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 1500 ఫోన్ల విలువ రూ.12 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ భారీ చోరీపై దర్యాప్తు జరుగుతున్నదని చెప్పారు. అంతేకాదు..ఈ చోరీలో ప్రధాన నిందితుడు సెక్యూరిటీ గార్డుగా అనుమానిస్తున్నారు. తన అనుచరుల అతడే దాడి చేయించి ఈ దోపిడీ చేయించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద చోరీ జరిగినా యాపిల్ సంస్థ నుంచి పోలీసులకు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. అయితే.. దుండగులపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేసిన ముగ్గురు సిబ్బందిపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

Tags:    

Similar News