మీడియాను గెలికిన ప్రశాంత్ కిశోర్ !

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలపై పీకే సీరియస్ అయ్యాడు.

Update: 2024-06-02 09:14 GMT

‘ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజల సమయాన్ని వృధా చేశాయి. ఇది పనికిరాని చర్చ.

బూటకపు జర్నలిస్టులు, మతోన్మాద రాజకీయ నాయకులు, సోషల్ మీడియాలో స్వయం ప్రకటిత నిపుణుల విశ్లేషణలు, పనికిమాలిన చర్చలతో మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి’ అని ఎన్నికల వ్యూహకర్త, విశ్లేషకుడు, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు.

ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన తర్వాత పీకే తొలిసారిగ స్పందించాడు. పనిలో పనిగామీడియాను కూడా టార్గెట్ చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలపై పీకే సీరియస్ అయ్యాడు. తాజాగా మరోసారి మీడియాను టార్గెట్ చేయడం గమనార్హం.

ఈ ఎన్నికల్లో 2019 ఫలితాలు పునరావృతం అవుతాయని ప్రశాంత్ కిశోర్ అన్నాడు. అయితే బీజేపీ 400 మార్క్ దాటడం కష్టమని తేల్చి చెప్పారు. బీజేపీకి 270 సీట్లు కూడా రావని అందరూ అనుకుంటున్నారు. కానీ 370 సీట్లకు పైనే గెలుచుకుంటుందని పీకే అంచనా వేశాడు.

Tags:    

Similar News