సజ్జల విచారణకు రావాల్సిందిగా కోరుతున్నాం!... ముహూర్తం ఫిక్స్!

అవును... వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Update: 2024-10-16 14:54 GMT

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో నాడు దాడికి పాల్పడినవారిపై వరుసగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో సజ్జలకు నోటీసులు పంపారు పోలీసులు!

అవును... వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా... టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. గురువారం (అక్టోబరు 17) ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేరొన్నారు.

దీంతో... గురువారం ఏమి జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది. నాడు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో పట్టాభి... వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతో.. ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడినట్లు కథనాలొచ్చాయి. అప్పట్లో ఈ విషయం తీవ్ర సంచలనం రేకెత్తించింది.

కాగా... వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 అక్టోబరు 19న ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి!! దీనిపై కేసు నమోదు కావడంతో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే!

ఇదే సమయంలో పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ లను ఇప్పటికే పలు దఫాలుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఈ నేపథ్యంలో... ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 17న విచారణ నిమిత్తం రావాలని నోటీసులో పేర్కొన్నారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు