'రాయిదాడి' తేలిపోయిందా? పోలీసులు ఏం చేస్తున్నారు?

మీడియాకు ఇచ్చిన లీకుల్లో.. రాయిదాడి నిందితుడు దొరికి పోయాడ‌ని పోలీసులు అన‌ధికారికంగా వెల్ల డించ‌డం గ‌మ‌నార్హం.

Update: 2024-04-16 09:33 GMT

రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై శ‌నివారం రాత్రి విజ‌య‌వాడ శివారులో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట న వ్య‌వ‌హారం.. కీలక మ‌లుపులు తిరుగుతూనే ఉంది. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా దుమారం రేప‌డం.. వైసీపీ నాయ‌కులు టీడీపీపై.. టీడీపీ నేత‌లు.. వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించుకున్న విష‌యం తెలిసిందే. ఇక‌, జ‌న‌సేన అధినేత అయితే.. నువ్వే విసురుకున్నావేమో.. జ‌గ‌న్ అంటూ దుయ్య‌బ‌ట్టారు. ఇలా.. రాజ‌కీయం గా వివాదం అయిన ఈ ఘ‌ట‌న‌లో తాజాగా పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.

మీడియాకు ఇచ్చిన లీకుల్లో.. రాయిదాడి నిందితుడు దొరికి పోయాడ‌ని పోలీసులు అన‌ధికారికంగా వెల్ల డించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఇత‌ను స్థానిక వ‌డ్డెర కాల‌నీకి చెందిన స‌తీష్ అని కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. ఇంకో క‌థ‌నం కూడా వినిపిస్తోంది. మొత్తం న‌లుగురు అనుమానితుల‌ను పోలీసు లు అదుపులోకి తీసుకున్నార‌ని.. వారిని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నార‌ని అధికారులు కొన్ని చానెళ్ల కు లీకులు ఇచ్చారు. దీంతో ఏది నిజ‌మో ఏది అబద్ధ‌మో తెలియ‌ని ఒక సంశ‌యం అయితే కొన‌సాగుతోం ది.

ఎందుకిలా..?

ప్ర‌స్తుతం రాజ‌కీయంగా దుమారం రేపుతున్న ఈ విష‌యంపై పోలీసులు చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రి స్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. ఎవ‌రో ఒక‌రు నిందితులుగా దొరికారంటే.. త‌క్ష‌ణ‌మే ఈ రాజ‌కీయ వివాదానికి తెర‌ప‌డుతుంద‌నే ఆలోచ‌న ఉన్న‌ట్టు తెలుస్తోంది. అద‌విధంగాదీనిలో విచార‌ణ కొన‌సాగిస్తున్నామ‌న్న వాద‌న‌ను కూడా తెర‌మీదికి తీసుకురావ‌డం ద్వారా.. ఖ‌చ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది?

ఇక‌, పోలీసులు చేస్తున్న విచార‌ణ , చెబుతున్న వివ‌రాల‌ను గ‌మ‌నిస్తే.. కొంత సందేహాల‌కు దారితీస్తోంది. ఎందుకంటే.. నిందితులను గుర్తించి.. త‌మ‌కు స‌మాచారం ఇచ్చిన వారికి రూ.2 ల‌క్ష‌ల రివార్డు ఇస్తామ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. ఇది జ‌రిగి 24 గంట‌లు కూడా కాలేదు. క‌నీసం.. ఈ ప్ర‌క‌టన పూర్తిగా ప్ర‌జ‌ల్లోకి కూడా వెష‌ళ్ల‌లేదు. ఇంత‌లోనే పోలీసులు ఇలా ప్ర‌క‌టించ‌డంపై విప‌క్షాలు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News