బిగ్ బ్రేకింగ్... జగన్ పై దాడి కేసులో పోలీసుల కీలక ప్రకటన!
అవును... నుదుటికి గాయం అయ్యి, కుట్లు పడిన అనంతరం ఈ రోజు తిరిగి జగన్ బస్సుయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
శనివారం రాత్రి 8:10 ప్రాంతంలో "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద ఒక ఆగంతకుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జగన్ ఎడమ కనుబొమ్మ పైన స్టిచ్చేస్ వేశారు వైద్యులు. మరోపక్క ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు.
అవును... నుదుటికి గాయం అయ్యి, కుట్లు పడిన అనంతరం ఈ రోజు తిరిగి జగన్ బస్సుయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు! ఇందులో భాగంగా... సీఎం వెళ్లే మార్గాన్ని సెక్టార్లుగా విభజించి.. ఒక్కో సెక్టారు వద్ద ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలకు భద్రత బాధ్యత అప్పగించారు. ఈ సమయంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు.
ఇందులో భాగంగా.. దాడి చేసిన వివరాలు తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా దాడిచేసిన వారి వివరాలు తెలిస్తే 94906 19342, 94406 27089 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా కృష్ణాజిల్లా పోలీసులు తెలిపారు.
ఇప్పటికే... ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో 20 మందితో కూడిన ప్రత్యేక టీం ఏర్పాటైంది. లా అండ్ ఆర్డర్, సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ఈ క్రమంలో... ముందుగా ఘటనా ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించారు. ఘటన అనంతరం అర్ధరాత్రి దాటాక నగర సీపీ కాంతిరాణా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.