చంద్రబాబుని విమర్శిస్తూ జయప్రద టాపిక్ ఎత్తిన పోసాని!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ ని గద్దె దించాలని కూటమి భావిస్తుండగా.. ఈసారీ గెలుపు తమదే అంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు కదులుతున్నారు! ఈ సమయంలో విమర్శలు, ప్రతి విమర్శల యుద్ధం పీక్స్ కి చేరుకుంటుంది. ఇందులో భాగంగా పోసాని కృష్ణమురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున విరుచుకుపడే వారిలో ఏపీ ఎఫ్.డి.సీ. చైర్మన్ పోసాని కృష్ణమురళి ఒకరనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని నిప్పులు చెరిగారు. ఇందులో భాగంగా... వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు అనే వ్యక్తి భ్రష్టుపట్టించారని.. నిమ్మగడ్డతో ఫిర్యాదూ చేయించి పించన్లు అందకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో... వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పోసాని.. ఇప్పుడు అదే వాలంటీర్ల వెంట పరుగెత్తుతున్నారని అన్నారు! గతంలో గోనె సంచులు మోసుకునే ఉద్యోగం అంటూ వాలంటీర్లను ఎద్దెవా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి రూ.10,000 జీతాలిస్తామంటూ వారి కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దెవా చేశారు.
ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు తలుపులు కొట్టేవారని.. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవారని చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడిన పోసాని.. "వాలంటీర్లు నీ కొడుకు నారా లోకేష్ లాగా తాగుబోతులు, తిరుగుబోతులు కాదు చంద్రబాబు" అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వాలంటీర్లపై చంద్రబాబు చూపిస్తున్న ప్రేమంతా మొసలి కన్నీరు బాపతు అని.. ఆయన సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.
ఈ సందర్భంగా నటి జయప్రద టాపిక్ తెరపైకి తెచ్చారు పోసాని కృష్ణమురళి. ఇందులో భాగంగా... ఎన్టీఆర్ హయంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జీవితాన్ని చంద్రబాబు నాశనం.. జయప్రద లాంటి పెద్ద హీరోయిన్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని పోసాని సంచలన ఆరోపణ చేశారు.
ఇదే సమయంలో.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని బజారుకు ఈడ్చాడని తీవ్ర విమర్శలు చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా పోసాని నిప్పులు చెరిగారు. జనసేన అనేది అసలు ఒక పార్టీయేనా? అని ఎద్దేవా చేసిన ఆయన.. గేదెలు కాచుకునేవాడు కూడా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మరని అన్నారు. ఇలా చంద్రబాబును విమర్శిస్తూ జయప్రద ప్రస్థావన తీసుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది!